వన్‌ప్లస్‌ 8T ఇలానే ఉంటుందా?
close

Updated : 02/09/2020 13:12 IST
వన్‌ప్లస్‌ 8T ఇలానే ఉంటుందా?

ఇంటర్నెట్‌డెస్క్: ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లతో వినియోగదారులను ఆకట్టుకుంటన్న వన్‌ప్లస్‌ తన 8 సిరీస్‌లో కొత్త ఫోన్‌ త్వరలో అందుబాటులోకి  తీసుకురానుంది. వన్‌ప్లస్‌ 8టీ పేరుతో త్వరలో ప్రవేశపెట్టనున్న ఈ ఫోన్‌కు సంబంధించిన ఫొటోను ఆండ్రాయిడ్ 11 డెవలపర్‌ ప్రివ్యూ సదస్సులో విడుదల చేశారు. ఫోన్‌కు సంబంధించిన ఇతర వివరాలు మాత్రం తెలియరాలేదు. టెక్‌ నిపుణుల అంచనా ప్రకారం ప్రస్తుతం మార్కెట్లో ఉన్న  వన్‌ప్లస్ 8, 8 ప్రో మోడల్స్‌ కంటే ఇది భిన్నంగా ఉండబోతుందట.

ఇక ఫీచర్స్‌ విషయానికొస్తే క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్ 865 ప్లస్‌ ప్రాసెసర్‌ ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఓఎస్)‌తో పనిచేస్తుందట. ‌పంచ్ హోల్‌‌ కటౌట్ డిస్‌ప్లే ఇస్తున్నారు. 8జీబీ ర్యామ్‌ /128 జీబీ ఇంటర్నెట్‌ స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. 64 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్‌ కెమెరాను అమర్చినట్లు టెక్‌ వర్గాలు తెలిపాయి.

ఇప్పటికే వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌ మార్కెట్లో సందడి చేయాల్సి ఉండగా, కొవిడ్-19 కారణంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో ఫోన్‌ విడుదల ఆలస్యం అయినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. అయితే ఈ ఫోన్‌ విడుదల, ధర, ఇతర ఫీచర్స్‌ వివరాలకు సంబంధించి సంస్థ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న