Google Lens: క్రోమ్ బ్రౌజర్‌లోకి గూగుల్ లెన్స్.. ఉపయోగాలివే! 
close

Published : 13/09/2021 22:18 IST
Google Lens: క్రోమ్ బ్రౌజర్‌లోకి గూగుల్ లెన్స్.. ఉపయోగాలివే! 

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం ఎక్కువ మంది ఉపయోగించే వెబ్‌ బ్రౌజర్లలో క్రోమ్ ముందువరుసలో ఉంటుంది. ఎప్పటికప్పుడు యూజర్‌ ప్రెండ్లీ ఫీచర్స్‌ని పరిచయం చేస్తూ ఇతర వెబ్‌ బ్రౌజింగ్‌ యాప్‌లకు గట్టి పోటినిస్తోంది. తాజాగా ఈ బ్రౌజర్‌ డెస్క్‌టాప్‌ వెర్షన్‌లో గూగుల్ లెన్స్‌ ఫీచర్‌ని పరిచయం చేశారు. మరి గూగుల్ లెన్స్‌తో లాభాలేంటి..? ఈ ఫీచర్‌ క్రోమ్ బ్రౌజర్‌లో ఎలా ఎనేబుల్ చేసుకోవాలో చూద్దాం. 

గూగుల్ లెన్స్‌ చేతితో రాసుకున్న నోట్స్ నుంచి పేపర్‌ క్లిప్పింగ్‌ వరకు ఎలాంటి టెక్ట్స్‌నైనా చదివి వినిపిస్తుంది. ఆన్‌లైన్‌ షాపింగ్ నుంచి ఫుడ్ రేటింగ్, ట్రాన్స్‌లేషన్‌ వరకు ఎన్నో రకాల పనులలో గూగుల్ లెన్స్ మీకు సాయపడుతుంది. ఉదాహరణకు మీకు వెబ్‌ పేజీలో టెక్ట్స్ చదవడం కంటే ఎవరైనా చదివి వినిపిస్తే బావుండనిపించింది. ఇందుకోసం మీ బ్రౌజర్‌లో లెన్స్‌ ఓపెన్ చేసి దానిపై ఫ్రేమ్‌ని డ్రాగ్ చేస్తే అందులోని టెక్ట్స్‌ని చదివి వినిపిస్తుంది. అలా మీకు నచ్చిన వంటకం, వస్తువులకు సంబంధించిన వివరాలు గూగుల్ లెన్స్ సాయంతో  తెలుసుకోవచ్చు. 

ఎలా ఎనేబుల్ చేయాలంటే?  

* మీ పీసీలో గూగుల్ క్రోమ్ వెబ్‌ బ్రౌజర్ ఓపెన్ చేసి chrome://flags అని టైప్ చేయాలి. 

* తర్వాత ఎక్స్‌పరిమెంట్స్‌ పేరుతో వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో పైన సెర్చ్‌ ఆప్షన్ ఉంటుంది. 

* అక్కడ Google Lens అని టైప్ చేస్తే సెర్చ్ యువర్‌ స్క్రీన్‌ విత్ గూగుల్ లెన్స్ అని కనిపిస్తుంది. దాని పక్కనే డిఫాల్ట్‌ అనే పేరుతో ఆప్షన్ బాక్స్‌ ఉంటుంది. 

* దానిపై క్లిక్ చేస్తే మీకు మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో ఎనేబుల్డ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి కింద రీలాంచ్‌పై క్లిక్ చేస్తే మీ క్రోమ్‌ బ్రౌజర్‌లో గూగుల్‌ లెన్స్ ఎనేబుల్ అవుతుంది. 

* క్రోమ్‌ స్టేబుల్ వెర్షన్ 93తోపాటు ఆపై డెస్క్‌టాప్‌ వెర్షన్లు మాత్రమే గూగుల్ లెన్స్ సపోర్ట్ చేస్తుంది. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న