నాయిస్‌ చవక స్మార్ట్‌వాచ్‌
close

Published : 07/07/2021 01:32 IST
నాయిస్‌ చవక స్మార్ట్‌వాచ్‌

తక్కువ ధరలో స్మార్ట్‌వాచ్‌ కోసం చూస్తున్నారా? అయితే నాయిస్‌ కలర్‌ఫిట్‌ క్యూబ్‌ వివరాలను ఓసారి పరిశీలించండి. ఇది వచ్చేవారం అమ్మకానికి రానుంది. ఏడు రోజుల వరకు ఆగకుండా పనిచేసే బ్యాటరీ దీని ప్రత్యేకత. రెండున్నర గంటల్లోనే పూర్తిగా ఛార్జ్‌ అవుతుంది. చదరపు ఆకారంలో 1.4 అంగుళాల టచ్‌ స్క్రీన్‌ డిస్‌ప్లే, 240 240 పిక్సెల్స్‌ రెజల్యూషన్‌తో ఆకట్టుకునే ఇది క్లౌడ్‌ బేస్డ్‌ వాచ్‌ఫేస్‌లనూ సపోర్టు చేస్తుంది. అంటే వాచ్‌ఫేస్‌ను కోరుకున్నవిధంగా మార్చుకోవచ్చన్నమాట. బ్లూటూత్‌ 5.1తో అనుసంధానమయ్యే ఇది ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ పరికరాలు రెండింటికీ అనుకూలం. బరువు 32 గ్రాములు. నలుపు, లేత గులాబీ రంగుల్లో లభ్యమవుతుంది. పని విషయానికి వస్తే.. గుండె వేగాన్ని, రక్తపోటును పసిగడుతుంది. అడుగుల సంఖ్య, ఖర్చయిన కేలరీలను ఎప్పటికప్పుడు లెక్కిస్తుంది. నిద్ర తీరుతెన్నులను, వ్యాయామ రికార్డులను నమోదు చేసుకుంటుంది. సైక్లింగ్‌, వాకింగ్‌, యోగా, ట్రెడ్‌మిల్‌, హైకింగ్‌, స్పిన్నింగ్‌,     క్లైంబింగ్‌ వంటి వివిధ స్పోర్ట్స్‌ మోడ్‌లతో కూడుకొని ఉంటుంది. అనుసంధానమైన పరికరాల నుంచి నోటిఫికేషన్లు అందిస్తుంది. ధర రూ.3వేల కన్నా తక్కువే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న