close

Updated : 14/04/2021 17:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జీమెయిల్‌లో కొత్తగా ‘ఛాట్‌’

మెసేజింగ్‌, గ్రూప్స్‌, మీట్స్‌.. అన్నీ ఒకేచోట

పీసీలోనే కాదు, ఫోన్‌లోనూ జీమెయిల్‌ని యాప్‌ ద్వారా యాక్సెస్‌ చేస్తుంటాం. మెయిల్స్‌ చూడడం.. పంపడమే కాకుండా ఇంకా చాలానే చేయొచ్చు. అందుకు ప్రత్యేకంగా ‘న్యూ ఛాట్‌ ట్యాబ్‌’ ప్రయోగాత్మకంగా అందుబాటులో ఉంది. దాన్ని ఎనేబుల్‌ చేస్తే చాలు. జీమెయిల్‌ లుక్కే మారిపోతుంది. మరెందుకు ఆలస్యం ఓ సారి ప్రయత్నించి చూద్దాం..

వ్యక్తిగత అవసరాలకే కాకుండా ఆఫీస్‌ పనులకూ జీమెయిల్‌ని వాడుతుంటాం. అలాంటప్పుడు కచ్చితంగా ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్‌గా ఉంటేనే కొత్త సౌకర్యాల్ని అందిపుచ్చుకోగలం. గత ఏడాది కాలంగా కరోనా భయంతో ఇంటికే పరిమితమైన నేపథ్యంలో టెక్నాలజీ, మాధ్యమాల్ని అనివార్యంగా ఫాలో అవ్వాల్సిన పరిస్థితి. అలాంటప్పుడు జీమెయిల్‌లో కొత్తగా ఏవేవి జత చేసుకోవచ్చో చెక్‌ చేశారా? ఇదిగోండి ఛాటింగ్‌కు అనుకూలంగా ఫోన్‌లోని జీమెయిల్‌ సర్వీసుని మార్చేసుకోవచ్చు. అందుకు సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘న్యూ ఛాట్‌’ని ఎనేబుల్‌ చేయాలి. దీంతో ఛాటింగ్‌, గ్రూపు ముచ్చట్లు, గూగుల్‌ మీట్‌ సేవల్ని జీమెయిల్‌లోనే పొందొచ్చు. ఆండ్రాయిడ్‌ యూజర్లు ఈ సేవల్ని ఉచితంగా యాక్సెస్‌ చేయొచ్చు. అధికారికంగా వీటిని గూగుల్‌ జీమెయిల్‌లో ప్రవేశపెట్టనప్పటికీ ప్రయోగాత్మకంగా జత చేసుకుని వాడేందుకు వీలుంది. యాప్‌ని ఓపెన్‌ చేశాక సెట్టింగ్స్‌లోకి వెళ్తే.. మెనూ కింది భాగంలో Chat (Early Access) ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని చెక్‌బాక్స్‌తో ఎనేబుల్‌ చేయాలి. దీంతో ట్రయల్‌ వెర్షన్‌ రూపంలో కొత్త ఛాట్‌ ఆప్షన్లు జీమెయిల్‌కి జత అవుతాయి. 

కొత్త లుక్‌లోకి మారిపోతుంది
జీమెయిల్‌ హోం స్క్రీన్‌పై గతంలో కనిపించని ఛాట్‌ ఆప్షన్లు కనిపిస్తాయి. మెయిల్‌ సర్వీసులే కాకుండా.. ‘ఛాట్‌’తో కాంటాక్ట్‌ని సెలెక్ట్‌ చేసి మెయిల్‌ నుంచే మెసేజింగ్‌ చేయొచ్చు. ఇదే విధంగా గ్రూపు క్రియేట్‌ చేసి ముచ్చట్లు పెట్టొచ్చు. అందుకు ‘రూమ్స్‌’తో గ్రూపుగా ఏర్పడొచ్చు. ఇక చివరిగా వీడియో సమావేశాలు నిర్వహించేందుకు లేదా జాయిన్‌ అయ్యేందుకు ‘మీట్స్‌’ని వాడుకోవచ్చు. ఇక గూగుల్‌ ఛాట్‌ మెసేజ్‌ నోటిఫికేషన్స్‌ కేవలం ‘జీమెయిల్‌’లోనే చూపించేలా సెట్‌ చేసుకోవచ్చు. దీంతో రెండు సార్లు ఛాట్‌ నోటిఫికేషన్స్‌ కనిపించవు. ఎనేబుల్‌ చేస్తే కొత్త ‘ఛాట్‌’ ఫీచర్‌ ‘ఎర్లీ యాక్సెస్‌’తో అందుబాటులో ఉంది. ఒకవేళ మీకు వాడడం ఇబ్బందిగా అనిపిస్తే.. తిరిగి యాప్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి డిసేబుల్‌ చేయవచ్చు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న

రుచులు