విద్యుదయస్కాంత ‘హైడ్రోజన్‌’
close

Published : 01/09/2021 01:00 IST
విద్యుదయస్కాంత ‘హైడ్రోజన్‌’

నీటి నుంచి హైడ్రోజన్‌ను తయారు చేయటానికి మన శాస్త్రవేత్తలు కొత్త పద్ధతిని రూపొందించారు. ఇది తక్కువ ఇంధనంతోనే హైడ్రోజన్‌ను మూడు రెట్లు ఎక్కువగా ఉత్పత్తి చేస్తుండటం గమనార్హం. చవకగా, పర్యావరణ హిత హైడ్రోజన్‌ తయారీకిది మార్గం చూపుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. స్వచ్ఛ, సుస్థిర ఆర్థికాభివృద్ధి సాధనలో హైడ్రోజన్‌ ప్రాముఖ్యత రోజురోజుకీ పెరుగుతోంది. అయితే శుద్ధ హైడ్రోజన్‌ తయారీలో అయస్కాంత క్షేత్రం ఆధారిత పద్ధతిలో నీటిని విడగొట్టటం, దీనికి ఎక్కువ ఖర్చు కావటం వంటి ఇబ్బందులు చాలానే ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొనే ప్రొఫెసర్‌ సి.సుబ్రమణ్యం నేతృత్వంలోని ఐఐటీ బాంబే పరిశోధకులు వినూత్న విధానాన్ని ఆవిష్కరించారు. వెలుపలి అయస్కాంత క్షేత్ర సమక్షంలో నీటిని విడగొట్టటం దీనిలోని కీలకాంశం. దీని ద్వారా 19% తక్కువ ఇంధనంతోనే  1 ఎంఎల్‌కు బదులు 3 ఎంఎల్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి అవుతుంది. నీటిని విడగొట్టే పరికరంలో విద్యుత్‌, అయస్కాంత క్షేత్రాలను సమన్వయం చేయటంతోనే దీన్ని సాధించగలిగారు. ఇందుకు కార్బన్‌, కోబాల్ట్‌ ఆక్సైడ్‌ను రసాయన ప్రేరేపకాలుగా ఉపయోగించుకున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎలక్ట్రోలైజర్లకు ఎలాంటి మార్పులు చేయకుండానే ఈ పద్ధతిని వినియోగించుకోవచ్చు. ఒకసారి 10 నిమిషాల సేపు అయస్కాంత క్షేత్ర ప్రభావానికి గురిచేస్తే 45 నిమిషాల వరకూ నీటి నుంచి హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయొచ్చు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న