‘నియర్‌ బై’... ఇప్పుడు పేరుకు తగ్గట్టుగా!
close

Published : 18/03/2021 18:56 IST
‘నియర్‌ బై’... ఇప్పుడు పేరుకు తగ్గట్టుగా!

షేర్‌ ఇట్‌ యాప్‌ను కేంద్ర నిషేధించడంతో... ఫైల్స్‌, ఫొటోస్‌, వీడియోస్‌ షేరింగ్‌కి యూజర్లు చాలా యాప్స్‌ను ట్రై చేస్తున్నారు. ఇలాంటివారి కోసం గూగుల్‌ కొన్నాళ్ల క్రితం ‘నియర్‌ బై షేర్‌’ పేరుతో ఓ ఫీచర్‌ను తీసుకొచ్చింది. షేర్‌ ఇట్‌ తరహాలోనే దీని ద్వారా ఫైల్స్‌ షేర్‌ చేసుకోవచ్చు. తాజాగా ఇందులో కొన్ని మార్పులు చేసి మరింత ఆకర్షణీయంగా మార్చింది. అదేంటంటే?


కాంటాక్ట్‌ల్లో ఉన్నవారే కాదు..

ఫైల్‌ షేరింగ్‌ విషయంలో ఎప్పటి నుంచో పోటీ కొనసాగుతోంది. నియర్‌బై షేర్‌ ఫీచర్‌ యూజర్లు అంతగా వాడకపోవడానికి కారణం ఫైల్‌ ట్రాన్స్‌ఫర్‌ కాస్త నెమ్మదిగా జరగడమే. అంతేకాదు.. ఒక్కసారి ఒకరికి మాత్రమే నియర్‌బై షేర్‌ నుంచి పంపడం సాధ్యం. అదీ.. తమ కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్నవారికి మాత్రమే డేటా షేర్‌ చేయడం సాధ్యం అవుతుంది. దీంతో తమ మొబైల్‌ కాంటాక్ట్స్‌లో లేని వారికి డేటా షేర్‌ చేయలేరు. అయితే ఇప్పుడు కొత్తగా గూగుల్‌ తెస్తున్న మార్పులతో ‘డివైజ్‌ విజిబిలిటీ’ ఫీచర్‌ మారనుంది. కాంటాక్ట్స్‌లో ఉన్నవారే కాకుండా, మీ ఫోన్‌కి దగ్గరల్లో ఉన్న ఇతర డివైజ్‌లనూ లిస్ట్‌లో చూడొచ్చు. దీన్నే ‘మల్టీ యూజర్‌ సపోర్టు’గా పరిచయం చేస్తోంది గూగుల్‌. దీన్ని ఎనేబుల్‌ చేసేందుకు డివైజ్‌ విజిబిలిటీలోని ‘ఎవ్రీవన్‌’ ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేయాలి. అలా ఇన్నాళ్లుగా పేరుకు తగ్గట్టుగా ‘నియర్‌బై షేర్‌’ పని చేస్తోందన్నమాట.


ఒకేసారి ఎంతమందికైనా..

ఇప్పటికే మీరు నియర్‌బై షేర్‌ వాడుతున్నట్లయితే.. మీరు గమనించే ఉంటారు. ఏదైనా ఎవరికైనా పంపాలనుకుంటే.. ఒక్క కాంటాక్ట్‌ని మాత్రమే ఎంపిక చేసుకుని సోలోగా పంపాలి. ఇకపై ఒక్కొక్కరిగా నెమ్మదిగా డేటాని ట్రాన్స్‌ఫర్‌ చేయాల్సిన అవసరం లేదు. ఒకేసారి ఎంతమందికైనా పంపొచ్చు. అదెలాగంటే.. ఫ్రెండ్స్‌ అందరూ ఒకే చోట ఉన్నారనుకుంటే.. వాళ్లందరినీ ఒకేసారి ‘నియర్‌బై షేర్‌’లో వెతికి.. ఒకేసారి డేటాని సెండ్‌ చేయొచ్చు. ఇక్కడ కాంటాక్ట్‌ లిస్ట్‌లో లేనివారు కనిపించినా.. వారికీ డేటాని షేర్‌ చేయొచ్చు. అంతేకాదు..  కొత్తగా బీటా వెర్షన్‌లో గమనించిన మరో మార్పు ఏంటంటే.. నియర్‌బై షేర్‌ పాప్ అప్‌ మెనూ. యాపిల్‌ ‘ఎయిర్‌డ్రాప్‌’ను పోలినట్టుగా డిజైన్‌ చేశారు. షేర్‌ చేసేందుకు చుట్టూ ఉన్న వారిని వెతికేందుకు అనువుగా మెనూలను డిజైన్‌ చేశారు. ప్రస్తుతానికి ప్రయోగాత్మక పరిశీలనలో ఉన్న ఈ అప్‌డేట్‌లను త్వరలోనే గూగుల్‌ ఆండ్రాయిడ్‌ ప్రియులకు పరిచయం చేయనుంది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న