Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146340
            [news_title_telugu_html] => 

తెరాస పాలనలోనే గ్రామాల అభివృద్ధి: జడ్పీ అధ్యక్షురాలు

[news_title_telugu] => తెరాస పాలనలోనే గ్రామాల అభివృద్ధి: జడ్పీ అధ్యక్షురాలు [news_title_english] => [news_short_description] => తెరాస ప్రభుత్వ పాలనలోనే గ్రామాల అభివృద్ధి వేగంగా జరుగుతోందని జడ్పీ అధ్యక్షురాలు సునీతారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం కోట్‌పల్లి మండల పరిధిలోని జిన్నారం, కరీంపూర్‌, బార్వాద్‌ గ్రామాల్లో రూ.55 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => [publish_createdon] => 2019-08-23 01:21:50 [news_isactive] => 1 [news_status] => 2 ) )
తెరాస పాలనలోనే గ్రామాల అభివృద్ధి: జడ్పీ అధ్యక్షురాలు - EENADU
close

తాజా వార్తలు

తెరాస పాలనలోనే గ్రామాల అభివృద్ధి: జడ్పీ అధ్యక్షురాలు


సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ అధ్యక్షురాలు, వేదికపై ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్‌

కోట్‌పల్లి, న్యూస్‌టుడే: తెరాస ప్రభుత్వ పాలనలోనే గ్రామాల అభివృద్ధి వేగంగా జరుగుతోందని జడ్పీ అధ్యక్షురాలు సునీతారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం కోట్‌పల్లి మండల పరిధిలోని జిన్నారం, కరీంపూర్‌, బార్వాద్‌ గ్రామాల్లో రూ.55 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలోనే కోట్‌పల్లి మండలం వెనకబడి ఉందని, వీలైనన్ని నిధులు మంజూరుచేసి ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతామన్నారు. గ్రామాల్లో ప్రతిఒక్కరు మంజూరైన శౌచాలయాలు నిర్మించుకొని స్వచ్ఛ గ్రామాలుగా మలుచుకోవాలన్నారు. ఇంకుడుగుంతలు నిర్మించుకొని భూగర్భ జలాల పెంపునకు కృషి చేయాలన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో 40 వేలకు తగ్గకుండా మొక్కలు నాటి సంరంక్షించుకోవాలన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో అన్నివర్గాల ప్రజలు లబ్ధి పొందారన్నారు. వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ మాట్లాడుతూ.. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంలో సర్పంచులు కీలకపాత్ర పోషించాలన్నారు. ప్రతి గ్రామానికి త్వరలోనే నిధులు మంజూరుచేసి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షుడు లింగయ్య, సర్పంచులు అనిల్‌, వెంకటేశ్‌యాదవ్‌, విజయలక్ష్మి, పద్మ, సావిత్రి, ఎంపీటీసీలు బందెయ్య, మహేష్‌గౌడ్‌, నాయకులు దశరథ్‌గౌడ్‌, ప్రతాప్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, శివకుమార్‌ పాల్గొన్నారు.


జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.