శ్మశానంలో శివుడు

ఒకసారి పార్వతి ‘నాథా! కడిగిన ముత్యంలా కాకుండా ఒళ్లంతా బూడిద పులుముకుని శ్మశానాల్లో తిరుగుతావు. కపాలాలు, ఎముకలు, పాములు కంఠంలో ధరిస్తావు. ఆ దుర్వాసన ఎలా భరిస్తున్నావు?’ అనడిగింది.

Updated : 25 May 2023 00:42 IST

ఒకసారి పార్వతి ‘నాథా! కడిగిన ముత్యంలా కాకుండా ఒళ్లంతా బూడిద పులుముకుని శ్మశానాల్లో తిరుగుతావు. కపాలాలు, ఎముకలు, పాములు కంఠంలో ధరిస్తావు. ఆ దుర్వాసన ఎలా భరిస్తున్నావు?’ అనడిగింది.

‘పార్వతీ! భూతాలు శ్మశానాల్లో తిరుగుతూ ప్రజలను పీడిస్తున్నాయని బ్రహ్మదేవుడు కోరడంతో నేనొక తరుణోపాయం ఆలోచించాను. వాటిని కఠినంగా శిక్షించాను. శరణు కోరిన వాటికి అభయమిచ్చి భూత గణాల్లో చేర్చుకున్నాను. ఆ సమస్య తీరడంతో ప్రజలు సంతోషించారు. కానీ మోక్షం మీద అనురక్తితో యోగులు శ్మశానాల్లో యోగసాధన చేయడం ఆరంభించారు. వాళ్లకి సాయపడాలని నేనూ అక్కడే ఉంటున్నాను. లోకంలో శీతలం, ఉష్ణం అని రెండు తత్వాలుంటాయి. ఈ జగత్తు అంతా సౌమ్యం (పొడిగా ఉండేవి, ఆహ్లాదకరమైనవి, చల్లనివి), ఆగ్నేయం (అగ్ని సంబంధం, తీవ్రత కలిగినవి, భీకరమైనవి) అనే రెండింటి కలయికతో ఏర్పడుతున్నాయి. వాటిలో సౌమ్యతకు విష్ణువు, ఆగ్నేయానికి నేను అధిపతులం. రెండూ కలిసిన జగత్తును భరించడం వల్ల ఆగ్నేయ తత్వంతో పాతుకుపోయిన ఆకృతిని ధరించాను. లోక శ్రేయస్సే లక్ష్యం కదా!’ అంటూ బదులిచ్చాడు శివుడు.

శరత్‌ చంద్రిక


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని