విష్ణుమూర్తికి ప్రీతికరం తులసి

తులసిమొక్కను పరమ పవిత్రమైందిగా భావిస్తాం. ఇది విష్ణుమూర్తికి ప్రీతికరమైంది. తులసిలో దేవతలు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి.

Published : 29 Feb 2024 00:06 IST

తులసిమొక్కను పరమ పవిత్రమైందిగా భావిస్తాం. ఇది విష్ణుమూర్తికి ప్రీతికరమైంది. తులసిలో దేవతలు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. తులసి కోట వద్ద సంధ్యాదీపం వెలిగించడం, చుట్టూ ప్రదక్షిణలు చేయడం పుణ్యప్రదం. దైవారాధనలో తులసిదళాలు సమర్పించడం శ్రేష్ఠం. నదీస్నానంతో కలిగే ఫలితం తులసిని పూజిస్తే కలుగుతుంది. ఇంట్లో తులసి కోట ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. తులసి ఆకులు లేదా దళాలను మాత్రమే తుంచాలి. కొమ్మలను విరవకూడదు. తులసి ఆకులు తుంచేటప్పుడు ‘ఓం నమో నారాయణాయ’ అని స్మరించాలి. భక్తిశ్రద్ధలతో తులసిని పూజిస్తే, చేసిన పాపాలు నశిస్తాయని విష్ణు పురాణం పేర్కొంది. ఆధ్యాత్మికంగానే కాదు, ఔషధపరంగానూ తులసి అగ్రగణ్యమే. ఆయుర్వేదంలో అనేక చికిత్సలకు తులసిని ఉపయోగిస్తారు.

ఎల్‌.ప్రఫుల్ల చంద్ర


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని