విశ్వరేతాః

విష్ణుసహస్రనామావళిలో 88వది. ‘విశ్వరేతాః’ అంటే విశ్వమంతటికీ రేతస్సు లేదా బీజం ఆ జగన్నాథుడని చెప్పడం.

Published : 29 Feb 2024 00:11 IST

వందే విష్ణుం!

విష్ణుసహస్రనామావళిలో 88వది. ‘విశ్వరేతాః’ అంటే విశ్వమంతటికీ రేతస్సు లేదా బీజం ఆ జగన్నాథుడని చెప్పడం. సర్వానికి మూల కారణం శ్రీమహావిష్ణువే అని గుర్తుచేస్తుంది ఈ నామం. పోతన అంతటి కవీశ్వరుడు ‘సర్వమునకు మూలకారణంబెవ్వడు..’ అంటూ స్వామి విశిష్టతను స్పష్టంగా తెలియజేశాడు. ఆ జగన్నాథుణ్ణే.. ఆ పరమాత్ముణ్ణే శరణు వేడుతానన్నాడు.

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని