దుఃఖభరితమైన సుఖాలు

స్వామి వివేకానంద విదేశాల్లో ఓ శ్రీమంతుడు ఏర్పాటు చేసిన సత్సంగంలో ప్రసంగిస్తున్నారు.

Updated : 18 Apr 2024 04:21 IST

స్వామి వివేకానంద విదేశాల్లో ఓ శ్రీమంతుడు ఏర్పాటు చేసిన సత్సంగంలో ప్రసంగిస్తున్నారు. ఓ విదేశీ పారిశ్రామికవేత్త- ‘స్వామీ! ఈ భౌతిక సుఖాలు, వస్తు సముదాయాలు దుఃఖానికి కారణమవుతున్నాయని మీరంటున్నారు. కానీ అది నిజమనిపించటం లేదు. ఈ ఆధునిక వసతులు, సౌకర్యాలు, సౌలభ్యాలతో గొప్ప సుఖజీవనం సాధ్యమవుతోంది కదా?’ అన్నారు. ఆ మాటలు విన్న స్వామి వివేకానంద ‘అవును! మీరు సుఖాలను అనుభవిస్తున్నామనే అనుకుంటున్నారు. కానీ వాటి వల్ల మీకు నిజమైన ఆనందమేమీ దక్కటం లేదు. ఆ సుఖాలు ఎలాంటివో చెబుతాను వినండి. మూగజీవాలు భయం భయంగా ఎవరింట్లోనో దూరి.. ఆ ఇంటి యజమాని చూస్తే తమను తరిమేస్తాడేమో అనే భయంతో దొంగచూపులు చూస్తుంటాయి. ఆకలితో వంటపాత్రల్లోని పదార్థాలను హడావుడిగా తింటుంటాయి. తాము శ్రీమంతులమని భావించేవారు కూడా లౌకికసుఖాలను అలాగే అనుభవిస్తున్నారు. ఇలా గడిపే జీవితాలు పైకి ఉల్లాసభరితంగా కనిపిస్తాయి. నిజానికి లోపలంతా విషాదమే. చివరికి అది వేదనగా పరిణమిస్తుంది. పరమాత్మను మరిపిస్తుంది’ అంటూ వివరించారు. - చక్రి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని