వినయంగా ఉండండి!

ప్రభువు తాను చెప్పేవాటిని ముందుగా చేసి చూపేవాడు. రోమా సైనికులకు పట్టుబడే ముందు రాత్రి విందులో పాల్గొన్నాడు. ఆ సమయంలో ఓ పళ్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదాలు కడిగి, తుడవ సాగాడు. ఆయనలా చేస్తుంటే  శిష్యులకు ఇబ్బందిగా ఉంది.

Published : 21 Mar 2024 00:07 IST

క్రీస్తు వాణి

ప్రభువు తాను చెప్పేవాటిని ముందుగా చేసి చూపేవాడు. రోమా సైనికులకు పట్టుబడే ముందు రాత్రి విందులో పాల్గొన్నాడు. ఆ సమయంలో ఓ పళ్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదాలు కడిగి, తుడవ సాగాడు. ఆయనలా చేస్తుంటే  శిష్యులకు ఇబ్బందిగా ఉంది. అందరి పాదాలతోపాటు.. తనను అప్పగించే శిష్యుడు యూదా పాదాలు కూడా కడిగాడు. ‘నేనేం చేశానో చూశారు కదా! ‘ప్రభూ, ప్రభూ!’ అంటున్న మీ పాదాల్ని ఎలా ప్రేమతో కడిగానో, మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడగాలని నేర్పడానికే (లూకా 2:15) ఇలా చేశాను. ఎంత గొప్పవారైనా దర్పం లేకుండా నిరాడంబరంగా వ్యవహరించాలి. అధిపతి అయినా వినయంగా, పరిచారకునిలా (లూకా 22:26) ఉండాలి’ అంటూ కార్య రూపేణ వివరించాడు. పేతురును ఉద్దేశించి ‘నీకు నేను తెలియదని మూడుసార్లు అబద్ధం చెబుతావు’ అనగానే.. ‘ప్రభూ! నీ కోసం చనిపోవడానికైనా సిద్ధమే కానీ అలా చేయను’ అన్నాడతను. మిగిలిన శిష్యులు కూడా (మత్తే 26:34) అదే మాట చెప్పారు. ఈ ఘట్టం అంతా ‘ది హోలీ మాస్‌’గా స్థిరపడింది.

డా.ఆర్వీ దేవదాసు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని