Jobs Alert: 5 నోటిఫికేషన్లు.. 25,000+ ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి అలర్ట్‌. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

Updated : 18 Mar 2024 16:08 IST

Government Jobs Recruitment | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థులకు అలర్ట్‌.. దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో దాదాపు 25 వేలకు పైగా ప్రభుత్వ కొలువుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టులతో పాటు రైల్వే శాఖలో టెక్నీషియన్‌, ఈఎస్‌ఐల్లో నర్సింగ్‌ ఆఫీసర్‌, ఎస్‌ఎస్‌సీ, ‘నవోదయ’లలో పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు వెలువడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా పోస్టుల వివరాలు, వేతనం, దరఖాస్తుకు చివరి తేదీలను ఈ కింది వార్తల్లో ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.

TS డీఎస్సీ దరఖాస్తుల గడువు జూన్‌ 20 వరకు..

తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ (TS DSC) పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ గడువు జూన్‌ 20 వరకు ఇటీవలే ప్రభుత్వం పొడిగించింది. డీఎస్సీ పరీక్షలు జులై 17 నుంచి 31 వరకు జరగనున్నాయి. మొత్తం ఉద్యోగాల్లో 2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉండగా.. 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు; స్పెషల్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 220 స్కూల్‌ అసిస్టెంట్‌, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి.


రైల్వే శాఖలో 9,144 టెక్నీషియన్‌ పోస్టులు

రైల్వే శాఖలో 9,144 టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 21 ఆర్‌ఆర్‌బీల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు ఏప్రిల్‌ 8 రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అందులో ఏవైనా పొరపాట్లు ఉంటే ఏప్రిల్‌ 9 నుంచి 18 వరకు సరిచేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు, ఇతర వివరాలివే..


ఈఎస్‌ఐసీల్లో 1,930 నర్సింగ్ ఆఫీసర్లు..

దేశంలోని ఈఎస్‌ఐసీల్లో పని చేసేందుకు నర్సింగ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి యూనియన్‌ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తోంది. కేంద్ర కార్మిక శాఖ పరిధిలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌(ESIC)లో శాశ్వత ప్రాతిపదికన ఈ పోస్టులు భర్తీ చేస్తారు. మొత్తం 1,930 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 27 వరకు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ https://upsconline.nic.in/ లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలివే..


2,049 పోస్టులకు ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్‌.. నేడే లాస్ట్‌!

కేంద్ర ప్రభుత్వశాఖల్లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 2,049 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) ద్వారా ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అర్హులైన వారి నుంచి ఆన్‌లైన్‌లో https://ssc.gov.in/ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ, పీజీ అర్హత కలిగినవారు ఆయా పోస్టులకు అర్హులు. నోటిఫికేషన్‌లో ముఖ్యాంశాలివే..


నవోదయలో 1377 ఉద్యోగాలు.. త్వరలో దరఖాస్తులు మొదలు

మరోవైపు, దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాల్లో బోధనేతర (నాన్‌ టీచింగ్‌) సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్‌ వెలువడింది.  దేశంలోని 1,377 నాన్‌ టీచింగ్‌ సిబ్బంది భర్తీకి నవోదయ విద్యాలయ సమితి (NVS) దరఖాస్తులు స్వీకరించనుంది. ఉద్యోగ స్థాయిని బట్టి భారీ వేతనాలు అందించనున్నారు. అర్హులైనవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు, పరీక్ష తేదీలను ఇంకా ప్రకటించాల్సి ఉంది. పూర్తి వివరాలివే..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని