Telangana DSC: తెలంగాణ డీఎస్సీ పరీక్ష తేదీలు ఖరారు

తెలంగాణ డీఎస్సీ పరీక్షకు తేదీలు ఖరారయ్యాయి.

Updated : 18 Mar 2024 15:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ (TS DSC) పరీక్షకు తేదీలు ఖరారయ్యాయి. డీఎస్సీ పరీక్ష తేదీలను విద్యాశాఖ ప్రకటించింది. జులై 17 నుంచి 31 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 29న సీఎం రేవంత్ రెడ్డి నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు జూన్‌ 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం ఉద్యోగాల్లో 2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉండగా.. 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు; స్పెషల్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 220 స్కూల్‌ అసిస్టెంట్‌, 796 ఎస్జీటీ పోస్టులు చొప్పున భర్తీ చేయనున్నారు.

దరఖాస్తుల కోసం క్లిక్‌ చేయండి

ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో శిక్షణ పొందిన బీఈడీ, డీఈడీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డీఎస్సీకి అర్హత సాధించే విధంగా సాధ్యమైనంత తొందరగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు.  డీఎస్సీ రాసేందుకు  టెట్‌ తప్పనిసరి కావడంతో మరోసారి పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల మందికి ఊరట లభించే అవకాశం ఉంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని