ఐఐటీ గాంధీనగర్‌ ఫెలోషిప్‌

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ - గాంధీనగర్‌) 2023 ‘ఎర్లీ-కెరియర్‌ ఫెలోషిప్‌ (ఐఐటీజీఎన్‌ - ఈసీఎఫ్‌) ప్రోగ్రాంకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

Updated : 01 Nov 2023 04:43 IST

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ - గాంధీనగర్‌) 2023 ‘ఎర్లీ-కెరియర్‌ ఫెలోషిప్‌ (ఐఐటీజీఎన్‌ - ఈసీఎఫ్‌) ప్రోగ్రాంకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పరిశోధనల్లో విద్యార్థులను మరింతగా మమేకం చేయాలనే ఉద్దేశంతో దీన్ని అందిస్తున్నారు. ఈ ఫెలోషిప్‌కు ఇటీవల పీహెచ్‌డీ తీసుకుని, ఐఐటీ గాంధీనగర్‌ అధ్యాపకులతో కలిసి రిసెర్చ్‌ ప్రాజెక్టుల్లో పనిచేయాలనుకునేవారు దరఖాస్తు చేయవచ్చు. డిసెంబర్‌ 15వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరించనున్నారు.  

ఈ ప్రోగ్రాంకి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.లక్ష చొప్పున స్టైపెండ్‌ అందుతుంది. ఇందులో రూ.90 వేలు ఖర్చులకు, రూ.10 వేలు హెచ్‌ఆర్‌ఏగా ఇవ్వనున్నారు. వీటికి అదనంగా ఏడాదికి రూ.2 లక్షల   వరకూ ‘ప్రొఫెషనల్‌ డెవలప్‌మెంట్‌ గ్రాంట్‌’గా అందించనున్నారు. ఈ డబ్బును అభ్యర్థి ఇతర పరిశోధనా సంబంధిత కార్యకలాపాలకు వినియోగించవచ్చు. అంతర్జాతీయంగా జరిగే సమావేశాలు, వర్క్‌షాప్స్‌, శిక్షణ తరగతుల వంటి వాటికి వెళ్లిరావొచ్చు. తొలుత ఈ ఫెలోషిప్‌ను ఏడాది కాలానికి అందిస్తారు. తర్వాత అభ్యర్థి ప్రదర్శనను బట్టి మరో ఏడాది వరకూ పొడిగించే అవకాశం ఉంది.

అర్హత: ఈ ఫెలోషిప్‌కు దరఖాస్తు చేయదలచిన వారు జనవరి 2023లోగా వారి డాక్టోరియల్‌ థీసిస్‌ను సబ్మిట్‌ చేసి ఉండాలి. అలాగే దరఖాస్తు సమయంలో అభ్యర్థి తమ గురించిన పూర్తి వివరాలతో పర్సనల్‌ స్టేట్‌మెంట్‌ అందించాలి. ఎవరు ఏ స్ట్రీమ్‌లో అయినా దరఖాస్తు చేయవచ్చు కానీ ఒకే దరఖాస్తు ఇవ్వాలి.

మరిన్ని వివరాలకు: www.iitgn.ac.in/research/early_career_fellowship


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని