నిర్మాణ రంగంలో రాణిస్తారా?

దేశంలో ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తూ నిర్మాణరంగం శరవేగంగా విస్తరిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలకూ ఆస్కారం ఇస్తోంది. వీటిని సొంతం చేసుకోవడానికి ప్రత్యేక నైపుణ్యాలు అవసరం.

Updated : 17 Jan 2024 03:23 IST

దేశంలో ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తూ నిర్మాణరంగం శరవేగంగా విస్తరిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలకూ ఆస్కారం ఇస్తోంది. వీటిని సొంతం చేసుకోవడానికి ప్రత్యేక నైపుణ్యాలు అవసరం. ఆ దిశగా సుశిక్షితులైన మానవ వనరులను రూపొందించడానికి దేశంలో పలు సంస్థలు వెలిశాయి. వాటిలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌ (నిక్మార్‌) ముఖ్యమైంది. ఈ సంస్థ హైదరాబాద్‌ క్యాంపస్‌లో పలు కోర్సులు అందిస్తోంది. వాటిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

నిక్మార్‌ హైదరాబాద్‌ (షామీర్‌పేట) క్యాంపస్‌లో రెండేళ్లు, ఏడాది వ్యవధితో పలు రియల్‌ ఎస్టేట్‌ మేనేజ్‌మెంట్‌, అనుబంధ కోర్సులు అందిస్తున్నారు. పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూలతో ప్రవేశం లభిస్తుంది. అకడమిక్స్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులకు టాప్‌ ర్యాంకర్‌ స్కాలర్‌షిప్పులు అందిస్తున్నారు. పది, ఇంటర్‌/డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌లో 95 శాతం మార్కులకు 80 శాతం ట్యూషన్‌ ఫీజు తగ్గిస్తారు. 90 శాతం మార్కులు ఉంటే 60 శాతం ఫీజులో రాయితీ ఉంటుంది. 85 శాతం మార్కులకు ఫీజులో 40 శాతం మినహాయిస్తారు. అలాగే 80 శాతం ఉన్నవారికి 20 శాతం తగ్గిస్తారు.

పరీక్ష ఇలా...

నిక్మార్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్టు (ఎన్‌క్యాట్‌) 180 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో క్వాంటిటేటివ్‌ అండ్‌ ఎనలిటికల్‌ ఎబిలిటీ 72, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ 36, వెర్బల్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీ 72 మార్కులకు ఉంటాయి. పరీక్షలో ప్రతిభ చూపినవారికి జీడీ, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. గ్రూప్‌ డిస్కషన్‌కు 20, పర్సనల్‌ ఇంటర్వ్యూకు 30, అప్లికేషన్‌ రేటింగ్‌ (అకడమిక్‌ ప్రతిభ, పని అనుభవం)కు 70 మార్కులు కేటాయించారు. మొత్తం 300 మార్కులకు గానూ చూపిన ప్రతిభ ప్రకారం ప్రవేశాలు లభిస్తాయి. సీయూఈటీ (పీజీ), క్యాట్‌, మ్యాట్‌, ఎక్స్‌ఏటీ, ఎన్‌మ్యాట్‌, ఏటీఎంఏ.. వీటిలో ఏదైనా స్కోరు ఉన్నవారు ఎన్‌క్యాట్‌ నుంచి మినహాయింపు పొందవచ్చు.  

ఏయే అవకాశాలు?

నిక్మార్‌లో విద్య అభ్యసించినవారు ప్రాంగణ నియామకాల ద్వారా ప్రముఖ స్థిరాస్తి, రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టింగ్‌, సిమెంట్‌ పరిశ్రమ, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌.. సంస్థల్లో ఉద్యోగాలు సొంతం చేసుకుంటున్నారు. లోథా, అదానీ, జేఎంసీ ప్రాజెక్ట్స్‌, శోభ, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, డీఎల్‌ఎఫ్‌ బిల్డింగ్‌ ఇండియా, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, యునీటెక్‌, టాటా హౌసింగ్‌, అన్సాల్‌ ఏపీఐ, రహేజా యూనివర్సల్‌, లార్సెన్‌ అండ్‌ టబ్రో, పంజ్‌ లాయిడ్‌ గ్రూప్‌, 99 యాకర్స్‌, మ్యాజిక్‌ బ్రిక్స్‌, ఇండియా ప్రాపర్టీ, ఇండియా హౌసింగ్‌.కామ్‌.. ఇలా సుమారు 125 సంస్థలు ఇక్కడి విద్యార్థులను క్యాంపస్‌ నియామకాల ద్వారా తీసుకుంటున్నాయి. గత ఏడాది ప్రాంగణ నియామకాల్లో గరిష్ఠంగా రూ.22 లక్షల వార్షిక వేతనంతో అంతర్జాతీయ ప్యాకేజీ లభించింది. దేశీయంగా రూ.12 లక్షల అత్యధిక వేతనం దక్కింది. సగటున ఇక్కడి విద్యార్థులు రూ.9.14 లక్షల వార్షిక ప్యాకేజీ పొందారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 31

వెబ్‌సైట్‌: www.nicmar.ac.in/hyderabad          


ఇవీ కోర్సులు

1 పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ అడ్వాన్స్‌డ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌

వ్యవధి: రెండేళ్లు

అర్హత: ఇంజినీరింగ్‌/ ఆర్కిటెక్చర్‌/ ప్లానింగ్‌ ఎందులోనైనా 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ


2 పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ అడ్వాన్స్‌డ్‌ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీపీ ఏపీఎం)

వ్యవధి: రెండేళ్లు

అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ


3 పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ క్వాంటిటీ సర్వేయింగ్‌ అండ్‌ కాంట్రాక్ట్‌ మేనేజ్‌మెంట్‌

వ్యవధి: ఏడాది

అర్హత: ఇంజినీరింగ్‌/ ఆర్కిటెక్చర్‌/ ప్లానింగ్‌ ఎందులోనైనా 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ


4 పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ హెల్త్‌ సేఫ్టీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌  

వ్యవధి: ఏడాది

అర్హత: 50 శాతం మార్కులతో ఇంజినీరింగ్‌ బ్యాచిలర్‌ డిగ్రీ


5 పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌

వ్యవధి: రెండేళ్లు

అర్హత: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌, ఆర్కిటెక్చర్‌, ప్లానింగ్‌, మేనేజ్‌మెంట్‌, ఎకనామిక్స్‌, మ్యాథమెటిక్స్‌, స్టాటిస్టిక్స్‌, అగ్రికల్చర్‌, ఇంజినీరింగ్‌... వీటిలో ఎందులోనైనా 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ


6 పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌  మేనేజ్‌మెంట్‌  

వ్యవధి: ఏడాది

అర్హత: ఇంజినీరింగ్‌, ఆర్కిటెక్చర్‌, ప్లానింగ్‌, కామర్స్‌, పైనాన్స్‌, బ్యాంకింగ్‌, మేనేజ్‌మెంట్‌, ఎకనామిక్స్‌, మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌ వీటిలో ఎందులోనైనా 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ  


పై అన్ని కోర్సులకూ చివరి ఏడాది విద్యార్థులూ అర్హులే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని