కొవిడ్‌ సంక్షోభంలో రోబోల సేవలు!

చైనాలో పుట్టి ప్రపంచం అంతా వ్యాపించిన కరోనా పెను ప్రళయమే సృష్టించింది. రెండు సంవత్సరాలపాటు అన్ని దేశాల వైద్యారోగ్య వ్యవస్థలు కుప్పకూలిపోయాయి.

Published : 13 Mar 2024 00:05 IST

జనరల్‌ స్టడీస్‌
విపత్తు నిర్వహణ

చైనాలో పుట్టి ప్రపంచం అంతా వ్యాపించిన కరోనా పెను ప్రళయమే సృష్టించింది. రెండు సంవత్సరాలపాటు అన్ని దేశాల వైద్యారోగ్య వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. గతంలో ఎన్నడూ ఎదురుకాని అత్యవసర పరిస్థితులు ఏర్పడ్డాయి. జనజీవనాన్ని, ప్రపంచ ఆర్థిక ముఖచిత్రాన్ని ప్రబలంగా ప్రభావితం చేసిన ఈ జైవిక విపత్తు పరిణామాల గురించి అభ్యర్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. మానవ శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే కరోనా వైరస్‌ రూపాంతరాలు, దానిని ఎదుర్కొనే క్రమంలో జరిగిన ఆవిష్కరణలు, టీకాల తయారీలో భాగస్వాములైన ప్రభుత్వ,ప్రైవేటు సంస్థలు, బాధితులకు చికిత్స అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు, లాక్‌డౌన్‌ కాలంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలు, సంక్షేమ విధానాలపై అవగాహన పెంచుకోవాలి.

మానవకారక విపత్తు - కొవిడ్‌ - 19

కొవిడ్‌-19.విపత్తు 2020 సంవత్సరం నుంచి ప్రపంచం మొత్తాన్ని వణికించింది. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో క్రమక్రమంగా ఈ వ్యాధి విజృంభించి, ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసింది. విద్యార్థుల చదువులు నిలిచిపోయాయి. అనేక పరిశ్రమలు, వ్యాపారాలు మూతపడటంతో నిరుద్యోగం ప్రబలింది. 2021, డిసెంబరు 28 నాటికి ప్రపంచవ్యాప్తంగా 28 కోట్ల మందికి పైగా ఈ వ్యాధి బారినపడగా, 54 లక్షల మందికి పైగా మరణించారు. మరణాల్లో అమెరికాది మొదటి స్థానం కాగా, భారత్‌ రెండో స్థానంలో నిలిచింది.

దక్షిణ చైనాలోని వుహాన్‌ నగరంలో 2019, డిసెంబరు 31న బయటపడిన ఈ వ్యాధి ఏడాది వ్యవధిలోనే ప్రపంచం నలుమూలలకు శరవేగంగా విస్తరించింది. అనేక వేరియంట్లుగా రూపాన్ని మార్చుకుంటూ నేటికీ విస్తరిస్తూనే ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని