నోటిఫికేషన్స్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 33 గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (గురుకులం) విడుదల చేసింది.

Published : 04 May 2024 00:25 IST

ఇంటర్‌ ప్రవేశాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 33 గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (గురుకులం) విడుదల చేసింది. అర్హులైన పదో తరగతి ఉత్తీర్ణులైన గిరిజన, గిరిజనేతర విద్యార్థులు మే 15లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.


విద్యాధన్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రాం 2024

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2024 విద్యా సంవత్సరం పదో తరగతిలో 90 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఇంటర్మీడియట్‌ చదువుతున్న పేద విద్యార్థులకు విద్యాధన్‌ పేరుతో ‘సరోజిని దామోదరన్‌ ఫౌండేషన్‌’ ఉపకార వేతనాలు అందజేస్తోంది. ఇంటర్‌లో ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.10 వేల చొప్పున స్కాలర్‌షిప్‌ ఇస్తుంది. విద్యార్థుల కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.2 లక్షలలోపు ఉండాలి. ఆసక్తి ఉన్నవారు జూన్‌ 7వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.


ప్రాజెక్టు పోస్టులు

న్యూదిల్లీలోని ఐకార్‌- ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ - ఒప్పంద ప్రాతిపదికన 15 ప్రాజెక్టు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్నవారు మే 12లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.


డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సు

తిరుమల తిరుపతి దేవస్థానాల (తితిదే) పరిధిలోని శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ ఆలయ శిల్ప కళాశాల 2024-25 విద్యా సంవత్సరానికి డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత భోజనం, వసతి కల్పిస్తారు. శిక్షణలో చేరిన విద్యార్థి పేరు మీద తితిదే రూ.లక్ష బ్యాంకులో డిపాజిట్‌ చేస్తుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి ఆ మొత్తాన్ని అందిస్తోంది. ఆసక్తి ఉన్నవారు మే 17లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పూర్తి వివరాలు, మరిన్ని నోటిఫికేషన్ల కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని