కరెంట్‌ అఫైర్స్‌

అంతరించి పోయే ప్రమాదాన్ని ఎక్కువగా ఎదుర్కొంటున్న ఏ పక్షి జాతి పరిరక్షణ కోసం వాటి ఆవాస ప్రాంతాల్లో ఎక్కడెక్కడ భూగర్భ విద్యుత్తు లైన్ల ఏర్పాటుకు అవకాశం ఉందో పరిశీలించేందుకు

Published : 03 May 2024 00:43 IST

మాదిరి ప్రశ్నలు

అంతరించి పోయే ప్రమాదాన్ని ఎక్కువగా ఎదుర్కొంటున్న ఏ పక్షి జాతి పరిరక్షణ కోసం వాటి ఆవాస ప్రాంతాల్లో ఎక్కడెక్కడ భూగర్భ విద్యుత్తు లైన్ల ఏర్పాటుకు అవకాశం ఉందో పరిశీలించేందుకు తాజాగా సుప్రీంకోర్టు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది?

జ: బట్టమేక (ఈ జాతి పక్షులు భారత్‌, పాకిస్థాన్‌లలో విస్తరించాయి. 1969లో ఈ పక్షుల సంఖ్య పన్నెండు వందలకు పైగా ఉండేది. ప్రస్తుతం రెండు వందలకు తగ్గిపోయింది. వీటిలో 80 శాతం రాజస్థాన్‌, గుజరాత్‌లలోనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత నంద్యాల జిల్లాలోనూ బట్టమేక పక్షుల జాడ కనిసిస్తోంది.)


  • నాలుగు దేశాలతో కూడిన ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య సంఘం (ఈఎఫ్‌టీఏ - యూరోపియన్‌ ఫ్రీట్రేడ్‌ అసోసియేషన్‌ - ఎఫ్టా) తో భారత్‌ ఇటీవల చారిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎఫ్టాలోని నాలుగు సభ్య దేశాలు ఏవి? (ఈ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల వర్తక వృద్ధి, దాంతోపాటే ఇండియాలో ఉపాధి అవకాశాలు విస్తృతం కానున్నాయి. ఎఫ్టాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి భారత్‌ 2008 నుంచి ప్రయత్నిస్తోంది. ఎఫ్టా ఇప్పటికే చైనా, కెనడా, దక్షిణ కొరియా లాంటి 40 దేశాలతో 29 ఒప్పందాలు కుదుర్చుకుంది. ఎఫ్టా దేశాలకు 2022-23లో భారత్‌ ఎగుమతుల విలువ 192 కోట్ల డాలర్లు, దిగుమతుల విలువ 1674 కోట్ల డాలర్లు)

​​​​​​​జ: స్విట్జర్లాండ్‌, ఐస్‌ల్యాండ్‌, నార్వే, లిచెన్‌స్టీన్‌


  • అస్సాంలోని బ్రహ్మపుత్ర నది వెంట వరదలు, నది ఒడ్డు కోత ప్రమాద నిర్వహణను ప్రోత్సహించడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ఎంత మొత్తం రుణాన్ని మంజూరు చేసింది?

జ: 200 మిలియన్‌ డాలర్లు

​​​​​​​


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని