కరెంట్‌ అఫైర్స్‌

బ్రిటిష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా రాణి చెన్నమ్మ తిరుగుబాటు చేసి ఎన్ని సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2024, ఫిబ్రవరి 21న దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ‘నానూ రాణి చెన్నమ్మ’ (నేను కూడా రాణి చెన్నమ్మ) పేరిట ప్రచారాన్ని నిర్వహించారు.

Published : 24 Mar 2024 00:57 IST

మాదిరి ప్రశ్నలు

బ్రిటిష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా రాణి చెన్నమ్మ తిరుగుబాటు చేసి ఎన్ని సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2024, ఫిబ్రవరి 21న దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ‘నానూ రాణి చెన్నమ్మ’ (నేను కూడా రాణి చెన్నమ్మ) పేరిట ప్రచారాన్ని నిర్వహించారు. (చెన్నమ్మ 1778, అక్టోబరు 23న కర్ణాటకలో ప్రస్తుత బెలగావి జిల్లాలోని కగటి అనే గ్రామంలో జన్మించారు. కిత్తూరు రాజా మల్లసర్జను వివాహం చేసుకున్నారు. భర్త, కుమారుడి మరణానంతరం రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం ఈమె బ్రిటిష్‌ సేనలకు వ్యతిరేకంగా పోరాడటం ద్వారా ఖ్యాతి గాంచారు. 2007లో భారత ప్రభుత్వం రాణి చెన్నమ్మ జ్ఞాపకార్థం తపాలా స్టాంపును జారీ చేసింది.

జ: 200 సంవత్సరాలు

2024, ఫిబ్రవరి 4న అమెరికాలోని లాస్‌ఏంజెలెస్‌లో ప్రదానం చేసిన ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డుల్లో పురస్కారాలు పొందిన భారతీయులు ఎవరు?

జ: ప్రఖ్యాత తబలా కళాకారుడు జాకీర్‌ హుస్సేన్‌, గాయకుడు శంకర్‌ మహదేవన్‌, వయోలిన్‌ కళాకారుడు గణేష్‌ రాజగోపాలన్‌, డ్రమ్స్‌ కళాకారుడు సెల్వగణేష్‌ వినాయక్‌ రామ్‌, వేణుగాన విద్వాంసుడు రాకేష్‌ చౌరాసియా, (దిస్‌ మూమెంట్‌ ఆల్బమ్‌కు గాను జాకీర్‌ హుస్సేన్‌, శంకర్‌ మహదేవన్‌, గణేష్‌ రాజగోపాలన్‌, సెల్వగణేష్‌ వినాయక్‌ రామ్‌లతో కూడిన ‘శక్తి’ అనే సంగీత బృందం ‘బెస్ట్‌ గ్లోబల్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌’ విభాగంలో గ్రామీని గెలుచుకుంది. జాకీర్‌ హుస్సేన్‌కు ఈ పురస్కారంతోపాటు బెస్ట్‌ గ్లోబల్‌ మ్యూజిక్‌ పెర్ఫార్మెన్స్‌ (పాష్తో), బెస్ట్‌ కంటెంపరరీ ఇన్‌స్ట్రుమెంటల్‌ ఆల్బమ్‌ (యాజ్‌ వుయ్‌ స్పీక్‌) కేటగిరీలలో మరో రెండు గ్రామీలు లభించాయి. ‘పాష్తో’, ‘యాజ్‌ వుయ్‌ స్పీక్‌’ ఆల్బమ్‌లకు రాకేష్‌ చౌరాసియాలకు రెండు గ్రామీలు లభించాయి. ‘మిడ్‌నైట్స్‌ ’ ఆల్బమ్‌కు అమెరికన్‌ గాయని టేలర్‌ స్విఫ్ట్‌కు ‘ఆల్బమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ లభించింది. ఈ కేటగిరీ కింద గ్రామీ అవార్డు అందుకోవడం ఈమెకు ఇది నాలుగోసారి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని