కరెంట్‌ అఫైర్స్‌

క్వాంటమ్‌ సైన్స్‌లో చేసిన కృషికి ప్రతిష్ఠాత్మక ‘జీడీ బిర్లా అవార్డ్‌ ఫర్‌ సైంటిఫిక్‌ ఎక్స్‌లెన్స్‌’ పురస్కారాన్ని గెలుచుకున్న మహిళా శాస్త్రవేత్త ఎవరు?

Updated : 06 Apr 2024 00:47 IST

మాదిరి ప్రశ్నలు

  • క్వాంటమ్‌ సైన్స్‌లో చేసిన కృషికి ప్రతిష్ఠాత్మక ‘జీడీ బిర్లా అవార్డ్‌ ఫర్‌ సైంటిఫిక్‌ ఎక్స్‌లెన్స్‌’ పురస్కారాన్ని గెలుచుకున్న మహిళా శాస్త్రవేత్త ఎవరు? (ఈమె అలహాబాద్‌లోని హరీశ్‌ చంద్ర రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో క్వాంటమ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కంప్యూటేషన్‌ (క్యూఐసీ)లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈ అవార్డ్‌కు ఎంపికైన తొలి మహిళాశాస్త్రవేత్తగా, మొత్తం మీద 33వ శాస్త్రవేత్తగా ఘనత సాధించారు.)

జ: డాక్టర్‌ అదితి సేన్‌ డె

  • ఇటీవల వార్తల్లోకి వచ్చిన కలాదాన్‌ మల్టీ మోడల్‌ ట్రాన్సిట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ప్రాజెక్ట్‌ (కేఎంటీటీపీ)ను భారత్‌ ఏ దేశంతో కలిసి నిర్మిస్తోంది? (ఈ దేశం మీదుగా ఆగ్నేయాసియాతో అనుసంధానతను పెంచుకోవాలన్న భారత్‌ యోచనతో కేఎమ్‌టీటీపీ 2003లో పురుడు పోసుకుంది. 2008లో భారత్‌, ఈ దేశం దీనిపై సంతకాలు చేశాయి. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా కోల్‌కతాను బంగాళాఖాతం మీదుగా ఈ దేశంలోని రఖాయిన్‌ రాష్ట్రంలోని సిత్వే ఓడరేవుతో అనుసంధానిస్తారు. అక్కడి నుంచి కలాదాన్‌ నదీ మార్గం ద్వారా పలెత్వా పట్టణం వరకు ప్రయాణ మార్గం ఉంటుంది. పలెత్వా నుంచి మిజోరంలోని జోరినపుయికి 109 కిలోమీటర్ల రోడ్డు మార్గాన్ని నిర్మిస్తారు. ఇండియా ‘యాక్ట్‌ ఈస్ట్‌ విధానం’లో కేఎంటీటీపీ చాలా కీలకం. 2015 నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా అది నెరవేరలేదు. తర్వాత 2021కి పొడిగించినా ప్రాజెక్ట్‌ పూర్తికి నోచుకోలేదు. ఇటీవల పలెత్వా పట్టణాన్ని ఈ దేశంలోని తిరుగుబాటుదారులు ఆక్రమించుకోవడంతో ఈ ప్రాజెక్ట్‌ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి.)         

జ: మయన్మార్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని