చనిపోయాక ఏమవుతుంది?

ఒక వ్యాపారవేత్త కోట్లు సంపాదించాడు. తన ప్రాణం పోతే ఆ ధనాన్ని కూడా విడిచి పోవాల్సిందేనా అనుకుంటే బాధేసింది.

Updated : 14 Mar 2023 13:29 IST

క వ్యాపారవేత్త కోట్లు సంపాదించాడు. తన ప్రాణం పోతే ఆ ధనాన్ని కూడా విడిచి పోవాల్సిందేనా అనుకుంటే బాధేసింది. చనిపోయాక ఏమవుతుందో.. డబ్బునెలా తీసుకెళ్లాలో.. చెబితే గొప్ప కానుక ఇస్తానంటూ ప్రకటించాడు. ఒక జ్ఞాని వచ్చి, ‘నువ్వు విదేశాలకు వెళ్లినపుడు ఈ డబ్బును ఖర్చుపెడుతున్నావా?’ అనడిగాడు. ‘మన నోట్లు విదేశాల్లో చెల్లవు గనుక ఆయా దేశాలకు అనుకూలంగా మార్చుకుని వినియోగిస్తున్నాను’ అన్నాడు వ్యాపారవేత్త. ‘కదా! మరణానంతరం నీ సంపాదన నీతో రావాలంటే ముందుగా నువ్వు వెళ్లాలనుకున్న లోకాన్ని నిర్ధారించుకుని, దానికి తగిన విధంగా ధనాన్ని మ ర్చుకోవాలి. నరకానికి వెళ్లాలనుకుంటే నీ డబ్బును వ్యసనాలూ, చెడుకర్మలకు ఉపయోగించి పాపంగా మార్చుకో! స్వర్గానికి వెళ్లాలంటే ఆ ధనాన్ని ద నధర్మాలు, ధార్మిక కార్యాలకు ఖర్చుచేసి పుణ్యంగా మార్చుకో’ అన్నాడు. ధనికుడికి జ్ఞానోదయమై తన సొమ్మంతా తీసుకోమన్నాడు. కానీ జ్ఞాని కష్టపడకు డా ఉచితంగా వచ్చేదేదీ తీసుకోనన్నాడు. ధనికుడు ఆ సంపదను పుణ్యకార్యాలకు వినియోగించి సద్గతులు పొందాడు. ‘మనం సంపాది చింది మరణానంతరం వెంట తీసుకెళ్లొచ్చు’ అంటూ వివేకానందుడు చెప్పిన కథ ఇది.

అయ్యగారి శ్రీనివాసరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని