గురువు - గురి

గురువు దైవం కంటే గొప్పవాడని నమ్మిన శ్రీకరుడు ఏ పనైనా ఆయనను తలచుకుంటూ చేస్తాడు. గురుస్మరణతో ఏదైనా సాధ్యం అనుకుంటాడు. గృహస్థ ధర్మాన్ని స్వీకరించిన కొన్నాళకు గురువును చూడాలని బయల్దేరాడు. వర్షాల వల్ల నదిలో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది.

Published : 21 Mar 2024 00:08 IST

గురువు దైవం కంటే గొప్పవాడని నమ్మిన శ్రీకరుడు ఏ పనైనా ఆయనను తలచుకుంటూ చేస్తాడు. గురుస్మరణతో ఏదైనా సాధ్యం అనుకుంటాడు. గృహస్థ ధర్మాన్ని స్వీకరించిన కొన్నాళకు గురువును చూడాలని బయల్దేరాడు. వర్షాల వల్ల నదిలో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. పడవ గానీ, మరే సదుపాయం గానీ లేదు. వెంటనే కళ్లు మూసుకుని గురువును ధ్యానించాడు. ఆయన నామాన్ని జపిస్తూ నీళ్లలోకి దిగాడు. ఏ ఇబ్బందీ లేకుండా అవతలి ఒడ్డుకి చేరాడు. ఈ సంగతి విన్న గురువుకు ఆశ్చర్యంతోపాటు గర్వమూ కలిగింది. తన పేరుకే ఇంత మహిమ ఉంటే, తనకు ఇంకెంత మహిమ ఉంటుందో కదా అనుకున్నాడు. శిష్యుడిలా పడవ ఎక్కకుండానే నది దాటాలని, నీళ్ల మీద అవలీలగా నడవాలని నిశ్చయించుకున్నాడు. తక్షణం నది వద్దకు వెళ్లి తన పేరైనా చెప్పకుండా ‘నేను.. నేను..’ అని జపిస్తూ నీటి మీద నడవాలని ప్రయత్నించాడు. విఫలమై, నదిలో మునిగిపోయాడు. వ్యక్తి కన్నా విశ్వాసం గొప్పదని నిరూపించిందా ఉదంతం.

శార్వరీ శతభిషం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని