రావిచెట్టు శ్రీకృష్ణభగవానుడు

చాలా దేవాలయాల్లో రావిచెట్టు ఉంటుంది. దీనికి అశ్వత్థ వృక్షమనే పేరు కూడా ఉంది. ఈ చెట్టును భగవత్‌ స్వరూపంగా భావించి, పూజిస్తారు. పురాణేతిహాసాల్లో అశ్వత్థ వృక్ష ప్రస్తావన ఉంది.

Published : 11 Apr 2024 00:05 IST

చాలా దేవాలయాల్లో రావిచెట్టు ఉంటుంది. దీనికి అశ్వత్థ వృక్షమనే పేరు కూడా ఉంది. ఈ చెట్టును భగవత్‌ స్వరూపంగా భావించి, పూజిస్తారు. పురాణేతిహాసాల్లో అశ్వత్థ వృక్ష ప్రస్తావన ఉంది. రాత్రిపూట కూడా ప్రాణ వాయువును అందించే అతి తక్కువ చెట్లలో ఇదొకటి. ఔషధ గుణాలున్న ఈ వృక్షం అనేక రుగ్మతలను నయం చేస్తుంది. వాతావరణంలో ఉన్న హానికారక సూక్ష్మ క్రిములను నాశనం చేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. హిందూ ధర్మంలోని ఆచారాలు ఆధ్యాత్మికతను పెంచి, ప్రశాంతతను కలిగించడమే కాకుండా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. వినాయకుడికి ప్రీతిపాత్రమైన ఆకుల్లో రావి ఆకు ఒకటి. వృక్షాల్లో తాను అశ్వత్థ వృక్షాన్ని- అన్నాడు శ్రీకృష్ణభగవానుడు భగవద్గీతలో. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేస్తే సత్ఫలితాలు ఉంటాయన్నది ఆర్యోక్తి. ముఖ్యంగా సంతాన ప్రాప్తికి, శని, కుజ, నాగ దోషాల నివారణకు ఈ చెట్టును పూజిస్తారు. రావిచెట్టులో సర్వత్రా శ్రీకృష్ణుడు సమస్త దేవతలతో కూడి ఉంటాడని స్కందపురాణం పేర్కొంది.

నూతి శివానందం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని