దొంగతనానికి ముహూర్తం

సజ్జనులతో సహవాసం చేయాలే గానీ దుర్మార్గుల చెంత చేరకూడదని చెబుతూ సుఖబోధానంద స్వామి ఒక కథను ప్రస్తావించారు.. ‘ఒక దొంగ జమీందార్‌ ఇంట్లో దోచుకునేందుకు వెళ్లగా కావలివారు పట్టుకున్నారు.

Published : 25 Apr 2024 00:07 IST

గురుబోధ

జ్జనులతో సహవాసం చేయాలే గానీ దుర్మార్గుల చెంత చేరకూడదని చెబుతూ సుఖబోధానంద స్వామి ఒక కథను ప్రస్తావించారు.. ‘ఒక దొంగ జమీందార్‌ ఇంట్లో దోచుకునేందుకు వెళ్లగా కావలివారు పట్టుకున్నారు. అయినా జమీందార్‌ శిక్షించకుండా క్షమాభిక్ష ప్రసాదించాడు. పశ్చాత్తాపం చెందిన అతడు ‘ఇంకెన్నడూ ఈ పని చేయను’ అనుకున్నాడు. కానీ డబ్బు లేకుండా మనుగడ సాధ్యం కాదు కదా అనిపించింది. ‘ఈసారి కోశాగారానికి కన్నం వేసి, పెద్ద మొత్తం దొంగిలిస్తే.. ఇక చోరవృత్తిని వదిలేయొచ్చు. భటులకు చిక్కకూడదంటే మంచి ముహూర్తం అవసరం’ అనుకున్నాడు. మర్నాడు ఉదయం తాను దొంగిలించిన సొమ్ములో సగం వాటా ఇస్తానని జ్యోతిషం చెప్పే సిద్ధాంతిని ప్రలోభపెట్టి ముహూర్తం పెట్టించుకున్నాడు. తీరా కోశాగారంలో దొంగతనం చేస్తుండగా దొరికిపోయాడు. వంద కొరడా దెబ్బల శిక్ష విధించగా.. సిద్ధాంతితో చేసుకున్న ఒప్పందం గురించి చెప్పి, సగం శిక్ష అతడికీ చెందాలిగా- అన్నాడు. దొంగతో ఒప్పందం కుదుర్చుకున్నాడని తెలిసి.. దైవజ్ఞుని కూడా శిక్షించారు. దుష్టులకు దూరంగా ఉండాలే కానీ.. వారికి సాయం చేసినా, ప్రోత్సహించినా శిక్ష తప్పదు’ అంటూ ముగించారు.

పద్మజ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని