బంధించిన గాడిద

ఏసుప్రభువు సద్బోధలు చేస్తూ, బేతనియ అనే గ్రామానికి వెళ్లినప్పుడు.. ‘ఫలానాచోట ఒక గాడిద బంధించి ఉంది. తాడు విప్పి, దాన్ని తీసుకురండి’ అన్నాడు శిష్యులతో. వాళ్లలాగే చేశారు.

Published : 02 May 2024 00:34 IST

ఏసుప్రభువు సద్బోధలు చేస్తూ, బేతనియ అనే గ్రామానికి వెళ్లినప్పుడు.. ‘ఫలానాచోట ఒక గాడిద బంధించి ఉంది. తాడు విప్పి, దాన్ని తీసుకురండి’ అన్నాడు శిష్యులతో. వాళ్లలాగే చేశారు. మనం కూడా గాడిద వలెనే.. అనేక పాపబంధనాల్లో చిక్కుకుని ఉన్నాం. మనకు మనంగా వాటిని ఛేదించుకోలేం. దయామయుడైన ప్రభువే విముక్తి కలిగించాలి. అంతకుమించి మరో మార్గం లేదు. ఏ ఒక్క వ్యక్తీ పాపానికి అతీతుడు కాదు. మరి వాటి నుంచి విడుదల పొందాలంటే ప్రభువు కృపను అర్థించాలి. ఈ లోకంలో విముక్తి పొందాక.. మన కోసం పరలోక ద్వారాలు తెరుచుకుంటాయి. ఆ పరలోక ప్రవేశానికి అర్హత సంపాదించాలంటే.. దినదినం ఇక్కడ మనం ఎదుర్కొనే అనేక ఒడుదొడుకులను అధిగమించాలి. అందుకు కూడా ఏసు అనుగ్రహం కావాలి. కనుక.. మనం వేసే ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. నిరంతరం ఆత్మపరిశీలన చేసుకుంటూ పవిత్రతతో ముందుకు సాగాలి. కట్లు విప్పిన గాడిదపై ప్రభువు అధిరోహించినప్పుడు.. ఆ జీవి ఎంతో ఘనత పొందింది. అది నడిచే దారి పొడవునా ప్రజలు వస్త్రాలు పరిచారు. ఆ దినమే ‘మట్టల ఆదివారం’గా (లూక 19:36) ప్రసిద్ధి చెందింది. అందువల్ల అల్పులైన మనం ఘనత సాధించాలంటే ప్రభువు ఆజ్ఞలను అమలు చేయాలి. ఆయన మార్గంలో చిత్తశుద్ధితో నడవాలి. ఆయనకెన్నడూ దూరం కాకూడదు.

- జి.డేవిడ్‌ రాజు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని