వృషాకపిః

విష్ణుసహస్రనామావళిలో 101వది. ఈ పదానికి అసలైన అర్థం ఏమిటనే విషయంలో పండితుల మధ్య చాలా వివాదాలున్నాయి. కానీ భగవంతుడి మాటలను గ్రహించినప్పుడు ఈ వివాదాలు నిష్ప్రయోజనమైనవి అనిపిస్తుంది.

Published : 06 Jun 2024 00:11 IST

 

విష్ణుసహస్రనామావళిలో 101వది. ఈ పదానికి అసలైన అర్థం ఏమిటనే విషయంలో పండితుల మధ్య చాలా వివాదాలున్నాయి. కానీ భగవంతుడి మాటలను గ్రహించినప్పుడు ఈ వివాదాలు నిష్ప్రయోజనమైనవి అనిపిస్తుంది. ‘కపి’ అనే పదానికి పంది అని, ‘వృష’ శబ్దానికి ధర్మం అనే అర్థాలున్నాయి. కపి పదానికి మునిగి పోకుండా కాపాడేది అనే మరో విశేషార్థం కూడా ఉంది. శ్రీమహావిష్ణువు ఆదివరాహ అవతారంలో, ప్రళయం చివరలో ప్రపంచాన్ని సముద్రం అడుగు నుంచి పైకి లేపాడు. దాని వెనుక ధర్మరక్షణ అనే అంశం ఉంది. అదే వృష. అలా ధర్మోద్ధరణ చేసేవాడే ఆ స్వామి అని వివరిస్తుంది ఈ నామం.

వై.తన్వి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని