కుంకుమ చేయిజారి పడి పోవడం అశుభానికి సంకేతమా?

ఎప్పుడైనా కుంకుమ చేయిజారి కిందపడితే అది అపశకునం అనుకోవడం ఒక మానసిక బలహీనత మాత్రమే.

Updated : 14 Mar 2023 15:33 IST

ఎప్పుడైనా కుంకుమ చేయిజారి కిందపడితే అది అపశకునం అనుకోవడం ఒక మానసిక బలహీనత మాత్రమే. భూదేవికి బొట్టు పెట్టామని భావిస్తే సరిపోతుంది. నిజానికి దేవాలయాల్లో మెట్ల పూజలు చేస్తుంటారు భక్తులు. ఆ సందర్భంలో అందరూ నడిచే మెట్లదారి మీదే పసుపు - కుంకుమను పెట్టడం చూస్తుంటాం. అందువల్ల కుంకుమ కింద పడినంత మాత్రాన కీడు జరుగుతుందని భయపడాల్సిన అవసరంలేదు.

తథాస్తు దేవతలు ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాలని అంటారు. నిజమేనా?

తథాస్తు దేవతలు ఉన్నారో లేరో మనకు తెలియదు. మనం అన్ని సందర్భాల్లో మంచి మాటలే పలకాలనీ, మంచి సంకల్పాలే చేయాలనేది మన పూర్వీకుల, పెద్దల ఆశయం.  ప్రతికూలమైన మాటల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండకపోగా కొన్నిసార్లు మనకో, ఇతరులకో కష్టమో నష్టమో కలగవచ్చు కూడా. ఇవన్నీ ఆలోచించి, సర్వకాల సర్వావస్థల్లోనూ మన భావాలు పవిత్రంగా, మన మాటలు సంస్కారవంతంగా ఉండాలని గుర్తుంచుకోవడానికే  మన పెద్దలు తథాస్తు దేవతలపేర్లు చెబుతుంటారు.

- ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి, ప్రవచనకర్త


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని