Running: పరుగెత్తితే..ఒరిగేదేంటి?

కాలేజీ ఫ్రెండు.. గాళ్‌ఫ్రెండూ.. పక్కింటి అంకులూ.. ప్రతి ఒక్కరిదీ ఒకటే మాట. వ్యాయామం చేస్తే ఒంటికి మంచిదని. పరుగు, నడక.. ఏదైనా ఫర్వాలేదని.

Published : 01 Apr 2023 00:42 IST

కాలేజీ ఫ్రెండు.. గాళ్‌ఫ్రెండూ.. పక్కింటి అంకులూ.. ప్రతి ఒక్కరిదీ ఒకటే మాట. వ్యాయామం చేస్తే ఒంటికి మంచిదని. పరుగు, నడక.. ఏదైనా ఫర్వాలేదని. అసలింతకు దీంతో ఏం జరుగుతుంది? ఏం ఒరుగుతుంది? సింపుల్‌గా చెప్పాలంటే..

* క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మూడ్‌ బాగా లేదు అనే ముచ్చటే ఉండదు. భావోద్వేగాలు అదుపులో ఉంటాయి.
* ఒత్తిడి తగ్గుతుంది. జ్ఞాపకాలు.. దీర్ఘకాలం పదిలంగా ఉంటాయి.
*మానసిక ఆందోళనలు తగ్గుతాయి. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారు.
* కీళ్ల పని తీరు మెరుగవుతుంది. మెదడు చురుగ్గా పని చేస్తుంది.్చ
* గుండెకు బలం. కొన్నిరకాల క్యాన్సర్లు దూరమవుతాయి.
* రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం కాంతివంతగా తయారవుతుంది.
* నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి. సృజనాత్మక ఆలోచనలు పెరుగుతాయి.
* ఎముకలకు బలం. శృంగార సామర్థ్యం పెరుగుతుంది.
* మధుమేహం, రక్తపోటు అదుపులో ఉంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని