ఇప్పటికీ.. మారలేదు

ఎలన్‌ మస్క్‌, జెఫ్‌ బెజోస్‌, వారెన్‌ బఫెట్‌.. టాప్‌ బిలియనీర్లు. వ్యాపారంలో దూసుకెళ్లాలనుకునే చాలామంది యువతకు స్ఫూర్తిప్రదాతలు. వీళ్ల నుంచి మనం గ్రహించాల్సిన ఓ విషయం ఏంటో

Updated : 26 Feb 2022 05:57 IST

ఎలన్‌ మస్క్‌, జెఫ్‌ బెజోస్‌, వారెన్‌ బఫెట్‌.. టాప్‌ బిలియనీర్లు. వ్యాపారంలో దూసుకెళ్లాలనుకునే చాలామంది యువతకు స్ఫూర్తిప్రదాతలు. వీళ్ల నుంచి మనం గ్రహించాల్సిన ఓ విషయం ఏంటో తెలుసా? అరకొర సంపాదన నుంచి అపర కుబేరులుగా మారినా.. వీళ్లు కొన్ని అలవాట్లు ఇప్పటికీ మార్చుకోలేదు. ఏంటవి అంటే...?

వారెన్‌ బఫెట్‌

* రెండు గంటలు ఒంటరిగా గడుపుతారు. ఆలోచించడం.. ముఖ్య నిర్ణయాలు తీసుకోవడం.. పెట్టుబడుల ఆరాలు.. అన్నీ ఈ సమయంలోనేనట.

* అతి ముఖ్యమైనవి, ముఖ్యమైనవి, వాయిదా వేయదగ్గవి.. అని రోజువారీ పనులు విభజించుకొని ఆ ప్రకారం చేస్తారు.

* రోజుకి కనీసం వంద పేజీలైనా చదువుతారు.


జెఫ్‌ బెజోస్‌

* ఉదయం ఐదింటికే నిద్ర లేస్తారు. ఎనిమిది గంటలు తప్పనిసరిగా నిద్రపోతారు.

* ముప్ఫై నిమిషాలు పత్రికలు, పుస్తకాలు చదువుతారు.

* స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు రోజుకోసారి రివ్యూ చేసుకుంటారు.

* తన ఉద్యోగుల్లో రోజుకొకరితోనైనా మాట్లాడతారు. ఈమెయిల్స్‌కి సమాధానమిస్తారు.


ఎలన్‌ మస్క్‌

* ఉదయం ఏడింటికి నిద్ర లేస్తారు.

* రోజుని కొన్ని భాగాలుగా విభజించుకొని ఎప్పడేం చేయాలో పక్కాగా అదే చేస్తారు.

* ఐదేళ్ల తర్వాత ఎలా ఉండాలి అనే ప్రణాళికను రోజుకోసారి రివ్యూ చేస్తారట.

* నిద్రపోయే ముందు పుస్తక పఠనం తప్పనిసరి.గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు