బయోలు.. అభయాలు!

ముఖం చూసి మనసులో ఏముందో కనిపెట్టేయడం కష్టం. కానీ ఇన్‌స్టాగ్రామ్‌ ‘బయో’ చూసి వాళ్ల మనస్తత్వం ఏంటో ఇట్టే పట్టేయొచ్చు అంటారు. మరి మనకిష్టమైన కొందరి తారల మనసుల్లో, బయోల్లో ఏముంది?

Updated : 28 May 2022 11:55 IST

ముఖం చూసి మనసులో ఏముందో కనిపెట్టేయడం కష్టం. కానీ ఇన్‌స్టాగ్రామ్‌ ‘బయో’ చూసి వాళ్ల మనస్తత్వం ఏంటో ఇట్టే పట్టేయొచ్చు అంటారు. మరి మనకిష్టమైన కొందరి తారల మనసుల్లో, బయోల్లో ఏముంది?

‘మనస్‌ ఏకం.. వచస్‌ ఏకం.. కర్మణ్యేకం మహాత్మనామ్‌’  - విజయ్‌ దేవరకొండ

సోది లేకుండా చెప్పాలంటే.. మనసు చెప్పింది విను.. కష్టపడి పని చెయ్‌.. ఫలితం దానంతట అదే వస్తుంది అని. తను ఎవరి అండదండలు లేకుండా కష్టపడి ఒక స్టార్‌ హోదా అందుకున్నాడుగా మరి.


‘త్రో హ్యాపీనెస్‌ ఎరౌండ్‌ లైక్‌ ఏ కాన్ఫెటీ’  - రకుల్‌ప్రీత్‌ సింగ్‌

రంగురంగుల కాగితాల్లా నీ చుట్టూ సంతోషాల్ని వెదజల్లుమంటోంది రకుల్‌ప్రీత్‌. మనం సంతోషంగా ఉంటే, చుట్టుపక్కలా ఉండేలా చూస్తే.. అంతకుమించిన సానుకూల దృక్పథం ఏముంటుంది.


‘మూవీస్‌ సూపర్‌ కార్స్‌ టెక్నో’    - నాగచైతన్య

సూటిగా సుత్తి లేకుండా నాకు సినిమాలు, సూపర్‌ కార్లు, టెక్నాలజీ ఇష్టమని చెప్పేశాడు చై. తను ఓ రేసర్‌ కూడా అని దీని ద్వారా చాలామందికి తెలిసింది.


‘అట్లాస్‌ హ్యాండ్స్‌’  - పూజా హెగ్డే

బయోని అర్థం చేసుకోవడం కష్టం అనుకుంటే.. ఈ బుట్టబొమ్మకి అత్యంత ఇష్టమైన సాంగ్‌ ఏంటో తెలిస్తే జవాబు తేలిగ్గానే తెలిసిపోతుంది. అదే.. బెంజమిన్‌ ఫ్రాన్సిస్‌ పాడిన ‘అట్లాస్‌ హ్యాండ్స్‌’.


‘థింగ్స్‌ ఆర్‌ ఆల్వేస్‌ ఇంపాజిబుల్‌, రైట్‌ ఆప్‌ అంటిల్‌ దే ఆర్‌ నాట్‌’  - సమంతా

క పని పూర్తయ్యేవరకు, ఒక విజయం సాధించే వరకు అవి ఎప్పటికీ కష్టసాధ్యంగానే అనిపిస్తాయి అని. కష్టపడితే సాధ్యం కాని పనేదీ లేదని పరోక్షంగా చెబుతోంది సామ్‌.


‘బీ ఏ మిరకిల్‌’ - రష్మికా మందన్న

లుగురిలో ఒకరిలా కాకుండా నువ్వో అద్భుతంలా ఉండాలి అన్నది ఈ అమ్మడి మాట. మనపై మనం నమ్మకం పెట్టుకొని, బాగా కష్టపడితే ఈ అద్భుతం సాధ్యమేనని పరోక్షంగా చెబుతుందన్నమాట.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని