సాలూరు వైకాపాలో వర్గ విభేదాలు

సంస్థాగత పదవుల ఎంపికలో వైకాపా నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. శుక్రవారం ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర నివాసంలో వైకాపా పట్టణ నేతలు సమావేశమయ్యారు.

Published : 04 Jun 2022 03:33 IST

సాలూరు, న్యూస్‌టుడే: సంస్థాగత పదవుల ఎంపికలో వైకాపా నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. శుక్రవారం ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర నివాసంలో వైకాపా పట్టణ నేతలు సమావేశమయ్యారు. ప్రస్తుత పార్టీ పట్టణ అధ్యక్షుడు జె.సూరిబాబునే కొనసాగించాలా లేదా అని ఉప ముఖ్యమంత్రి స్థానిక నాయకులను అడగగా మార్చాలన్నారు. పాచిపెంట, మక్కువ మండలాల్లో పాత అధ్యక్షులనే కొనసాగిస్తున్నామని, ఇక్కడ కూడా అలాగే చేయాలని రాజన్నదొర అభిప్రాయం వ్యక్తం చేశారు. వెలమ, కాపు సామాజిక వర్గాలను కాదని పాత నేతనే ఉంచే కంటే యువ నాయకుడు గోవిందకు పదవి ఇవ్వాలని పలువురు తమ అభిప్రాయం వెల్లడించారు. ఎవరు ఉండాలో.. ఎవరు ఉంటే పార్టీకి మంచిదో మీరు నిర్ణయించుకోండని రాజన్నదొర ఇంట్లోకి వెళ్లిపోయారు. తర్వాత కమిటీ వేసి నిర్ణయం తీసుకోవాలని నేతలకు సూచించారు. అనంతరం నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. వెలమలకు ఇస్తే పురపాలక వైస్‌ ఛైర్మన్‌ వంగపండు అప్పలనాయుడు, కాపు సామాజిక వర్గానికి అయితే సీనియర్‌ నేత గొర్లె జగన్‌కు ఇవ్వాలని పలువురు కోరారు. కాదు పాత అధ్యక్షుడినే కొనసాగించాలని పువ్వల నాగేశ్వరరావు వ్యతిరేక వర్గం కోరింది. దీంతో నేతల మధ్య మాటామాట పెరిగి తోపులాటకు దారితీసింది.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని