ఉపాధ్యాయులపై కక్ష సాధింపు

ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ ఆరోపించారు. శుక్రవారం నగరంలోని యువజన వసతిగృహంలో

Published : 04 Jun 2022 04:06 IST

విద్యావిభాగం, న్యూస్‌టుడే: ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ ఆరోపించారు. శుక్రవారం నగరంలోని యువజన వసతిగృహంలో నిర్వహించిన ఏపీటీఎఫ్‌ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. సెలవులు ప్రకటించి, కార్యక్రమాలు అప్పగించడం హక్కులు కాలరాయడమేనని మండిపడ్డారు. పాఠశాలల విలీన ప్రక్రియ తగదని, వెంటనే నిలుపుదల చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.భానుమూర్తి, ఉపాధ్యక్షుడు టి.త్రినాథ డిమాండు చేశారు. సీపీఎస్‌పై మొండివైఖరిని విడనాడి, వెంటనే రద్దు చేయాలని జిల్లా గౌరవాధ్యక్షుడు బంకురు జోగినాయుడు కోరారు. అనంతరం జిల్లాశాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా షేక్‌ బుకారిబాబు, ప్రధాన కార్యదర్శిగా పి.శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా ఎం.ఉపేంద్ర, ఎన్‌.రవికుమార్, వి.సంపూర్ణలత, కార్యదర్శులుగా వై.భాస్కరరావు, వై.ఆదినారాయణ, ఎం.వెంకటరమణ, ఆర్‌.గోవిందనాయుడు, ఎ.రాంబాబును ఎన్నుకున్నారు. రాష్ట్ర కౌన్సిలర్లు, ఆడిట్‌ కమిటీ సభ్యులు, మీడియా ఇన్‌ఛార్జులను నియమించారు. శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి మన్మథకుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నల్లా బాలకృష్ణ, రవి పాల్గొన్నారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని