లైసెన్సు లేకపోతే రూ. 5 లక్షల జరిమానా

ఆహార పదార్థాల విక్రయదారులు కచ్చితంగా లైసెన్సు తీసుకోవాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఆహార కల్తీ నియంత్రణ శాఖ అధికారిణి ఎస్‌.ఈశ్వరి శుక్రవారం ఓ ప్రకటనలో

Published : 04 Jun 2022 04:06 IST

విజయనగరం రింగురోడ్డు, న్యూస్‌టుడే: ఆహార పదార్థాల విక్రయదారులు కచ్చితంగా లైసెన్సు తీసుకోవాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఆహార కల్తీ నియంత్రణ శాఖ అధికారిణి ఎస్‌.ఈశ్వరి శుక్రవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఏడాదికి రూ.12 లక్షల టర్నోవర్‌ దాటి వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్న వారంతా నిబంధనలు పాటించాలని, ఉల్లంఘిస్తే రూ.5 లక్షల జరిమానా విధిస్తామన్నారు. అంతేకాకుండా ఆరు నెలల పాటు విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. లైసెన్సులు, ఇతర వివరాల కోసం బాలాజీనగర్‌లోని తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని