క్షతగాత్రులను ఆసుపత్రుల్లో చేర్చితే రూ.లక్ష బహుమతి: కలెక్టర్‌

వాహన చోదకులు వేగం కన్నా సురక్షితంగా గమ్యం చేరడంపై దృష్టి సారించాలని కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి కోరారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు.

Published : 04 Jun 2022 04:21 IST

కలెక్టరేట్, న్యూస్‌టుడే: వాహన చోదకులు వేగం కన్నా సురక్షితంగా గమ్యం చేరడంపై దృష్టి సారించాలని కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి కోరారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. రహదారులకు ఇరువైపులా ఉన్న పొదలు, చెట్లను తొలగించాలని, ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రమాదాలు జరిగి ఆసుపత్రుల్లో చేరిన క్షతగాత్రుల వివరాలను ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని డీఎంహెచ్‌వో రమణకుమారికి సూచించారు. సంఘటనల సమయంలో క్షతగాత్రులను గంటలోపు ఆసుపత్రికి తీసుకెళ్లే వారిని గుడ్‌ సమారిటన్‌గా గుర్తించి అవార్డుతో పాటు రూ.లక్ష బహుమతి అందిస్తామన్నారు. ఎస్పీ దీపిక ఎం.పాటిల్‌ మాట్లాడుతూ శబ్ద, వాయు కాలుష్యం నివారణకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి, అవగాహన కల్పించాలన్నారు. కొత్త నిబంధనల ప్రకారం ఇకపై ప్రతి 15 రోజులకోసారి రహదారి భద్రత సమావేశం నిర్వహించాల్సి ఉందని రవాణాశాఖ ఉప కమిషనర్‌ శ్రీదేవి పేర్కొన్నారు. ఇటీవల లెండి కళాశాల సమీపంలో జరిగిన ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని సకాలంలో ఆసుపత్రికి తరలించిన గోపిని కలెక్టర్, ఎస్పీ తదితరులు ఘనంగా సన్మానించారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని