‘తారకరామ’ నిర్వాసితులకు న్యాయం చేస్తా

తారకరామ తీర్థసాగర్‌ ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేస్తామని ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనరు చెరుకూరి శ్రీధర్‌ పేర్కొన్నారు. శుక్రవారం నెల్లిమర్ల మండలం సారిపల్లి, పూసపాటిరేగ మండలం కుమిలిలో పర్యటించారు.

Published : 04 Jun 2022 04:21 IST

నెల్లిమర్ల/పూసపాటిరేగ, న్యూస్‌టుడే: తారకరామ తీర్థసాగర్‌ ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేస్తామని ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనరు చెరుకూరి శ్రీధర్‌ పేర్కొన్నారు. శుక్రవారం నెల్లిమర్ల మండలం సారిపల్లి, పూసపాటిరేగ మండలం కుమిలిలో పర్యటించారు. త్వరగా ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు కేటాయించాలని, 2013 చట్టం ప్రకారం ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని నిర్వాసితులు కోరారు. త్వరగా పరిహారం అందేలా చూడాలని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ పెనుమత్స సూర్యనారాయణరాజు కమిషనరు దృష్టికి తీసుకెెళ్లారు. కోరాడపేట నిర్వాసితుల పునరావాసానికి నెల్లిమర్లలో కేటాయించిన కాలనీలో మౌలిక వసతులు, అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. 

కలెక్టరేట్, న్యూస్‌టుడే: తోటపల్లి, తారకరామ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తదితర ప్రాజెక్టులకు భూసేకరణ, నిర్వాసితుల పునరావాస కార్యక్రమాలపై కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి, జేసీ మయూర్‌ అశోక్, అధికారులతో శ్రీధర్‌ సమీక్షించారు. తోటపల్లి కాలువల కోసం మరో 250 ఎకరాలు, రామతీర్థసాగర్‌కు 212 ఎకరాలు కావాలని, ఈ నెలాఖరుకల్లా ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. పరిహారం చెల్లింపునకు వారంలో బిల్లులు అప్‌లోడ్‌ చేయాలన్నారు. సుజల స్రవంతి ప్రాజెక్టుకు 4,500 ఎకరాలను రెండు ప్యాకేజీల్లో సేకరించాలని కోరారు. డీఆర్వో గణపతిరావు, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజినీరు ఎస్‌.సుగుణాకరరావు, జల వనరుల శాఖ ఈఈ రామచంద్రరావు, ఆర్డీవోలు భవానీశంకర్, ఎం.అప్పారావు, సర్వే విభాగం ఏడీ టి.త్రివిక్రమరావు, కేఆర్‌ఆర్‌సీ డిప్యూటీ కలెక్టర్‌ సూర్యనారాయణ పాల్గొన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని