5 నుంచి టీ-20 టిక్కెట్ల విక్రయాలు

విశాఖ వై.ఎస్‌.ఆర్‌.ఏసీఏ- వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంలో ఈనెల 14న జరగనున్న భారత్‌- దక్షిణాఫ్రికా టీ-20 మ్యాచ్‌ టిక్కెట్ల విక్రయాలు ఈనెల 5న ఉదయం 11.30 గంటలకు ఆన్‌లైన్‌లో ప్రారంభమవుతాయని

Published : 04 Jun 2022 05:17 IST

విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే: విశాఖ వై.ఎస్‌.ఆర్‌.ఏసీఏ- వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంలో ఈనెల 14న జరగనున్న భారత్‌- దక్షిణాఫ్రికా టీ-20 మ్యాచ్‌ టిక్కెట్ల విక్రయాలు ఈనెల 5న ఉదయం 11.30 గంటలకు ఆన్‌లైన్‌లో ప్రారంభమవుతాయని ఏసీఏ సీఈఓ ఎం.వి.శివారెడ్డి తెలిపారు. టిక్కెట్ల విక్రయాల్లో పేటీఎం అధికార భాగస్వామిగా ఉందన్నారు. www.insider.in , paytm app, paytm insider appలలో పొందవచ్చన్నారు. ఈనెల 8న ఉదయం 11 గంటలకు విశాఖలోని మూడు కేంద్రాల్లో ఆఫ్‌లైన్‌లో విక్రయిస్తామన్నారు. విశాఖ, హైదరాబాద్, విజయవాడ ప్రధాన నగరాల్లో హోమ్‌డెలివరీ (కొరియర్‌) చేస్తామన్నారు. రూ.600, రూ.1500, రూ.2000, రూ.3000, రూ.3,500, రూ.6000 ధరల టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని