సైకిల్‌ తొక్కితే.. ఆరోగ్యం సొంతం

రోజూ సైకిల్‌ తొక్కే వారికి ఆరోగ్యం సొంతమవుతుందని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఆదిలక్ష్మి పేర్కొన్నారు. భారత ప్రభుత్వ యువజన క్రీడల మంత్రిత్వశాఖ, నెహ్రూ యువ కేంద్రం, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థల ఆధ్వర్యంలో...

Published : 04 Jun 2022 05:17 IST

నర్సీపట్నం, న్యూస్‌టుడే: రోజూ సైకిల్‌ తొక్కే వారికి ఆరోగ్యం సొంతమవుతుందని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఆదిలక్ష్మి పేర్కొన్నారు. భారత ప్రభుత్వ యువజన క్రీడల మంత్రిత్వశాఖ, నెహ్రూ యువ కేంద్రం, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం ఇక్కడ ప్రపంచ సైకిల్‌ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక అబీద్‌ కూడలి నుంచి ప్రారంభమైన సైకిల్‌ ర్యాలీని ఛైర్‌పర్సన్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఎంపీపీ సుర్ల రాజేశ్వరి సైకిల్‌ తొక్కి అందరిలోనూ ఉత్సాహాన్ని నింపారు. చిన్నారులు, విద్యార్థులు తదితరులు వంద మంది పాల్గొన్నారు. పెదబొడ్డేపల్లి కూడలి వరకూ ఇది కొనసాగింది. శాప్‌ కోచ్‌ అబ్బు, క్రీడాకారులు పాల్గొన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని