గృహ నిర్మాణాలు వేగవంతం: కలెక్టర్‌

జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని, అసంపూర్తిగా ఉన్న సచివాలయ భవనాల నిర్మాణాలను పూర్తి చేయాలని కలెక్టర్‌ రవిసుభాష్‌ జిల్లా గృహనిర్మాణ సంస్థ ఏఈ ప్రసాద్‌ని ఆదేశించారు.

Published : 04 Jun 2022 05:17 IST

కశింకోట, న్యూస్‌టుడే: జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని, అసంపూర్తిగా ఉన్న సచివాలయ భవనాల నిర్మాణాలను పూర్తి చేయాలని కలెక్టర్‌ రవిసుభాష్‌ జిల్లా గృహనిర్మాణ సంస్థ ఏఈ ప్రసాద్‌ని ఆదేశించారు. కశింకోట మండలం తేగాడ, ఇ.చౌడువాడ లేఅవుట్లను, కన్నూరుపాలెం, గురువు భీమవరం, తాళ్లపాలెం-1 గ్రామ సచివాలయాలను, అడ్డాం పాలవెల్లువ కేంద్రాన్ని, ఇ.చౌడువాడలో ఉపాధి హామీ పనులను శుక్రవారం కలెక్టరు తనిఖీ చేశారు. గృహాల లబ్ధిదారులను చైతన్యవంతం చేసి నిర్మాణాలు పూర్తి చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. కన్నూరుపాలెం లేఅవుట్లలో హైటెన్షన్‌ విద్యుత్తు తీగలు తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధి హామీ కూలీలతో మమేకమై ఎంతసేపు పనులు చేస్తున్నారు, ఎంత ఆదాయం వస్తోంది, బీమా కార్డులు తదితర అంశాలను తెలుసుకున్నారు. ఈ పర్యటనలో తహసీల్దారు బి.సుధాకర్, ఇన్‌ఛార్జ్‌ ఎంపీడీఓ ఎ.ఎ.ఖాన్, ఈఓఆర్‌డీ కె.ధర్మారావు ఏపీఓ శివ,  జడ్పీటీసీ సభ్యుడు దంతులూరి శ్రీధర్‌రాజు పాల్గొన్నారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని