మాజీ సర్పంచి, వీఆర్వోపై ఛీటింగ్‌ కేసు

వెంకన్నపాలెం మాజీ సర్పంచి, వైకాపా నాయకుడు మొల్లి సోమునాయుడుతో పాటు వీఆర్వో బొడ్డు శ్రీనులపై ఛీటింగ్‌ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ విభీషణరావు తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన పరిహారం విషయమై రెవెన్యూ వర్గాలతో

Published : 04 Jun 2022 05:17 IST

చోడవరం, న్యూస్‌టుడే: వెంకన్నపాలెం మాజీ సర్పంచి, వైకాపా నాయకుడు మొల్లి సోమునాయుడుతో పాటు వీఆర్వో బొడ్డు శ్రీనులపై ఛీటింగ్‌ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ విభీషణరావు తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన పరిహారం విషయమై రెవెన్యూ వర్గాలతో పూర్తిస్థాయిలో చర్చించి నివేదిక తీసుకున్న అనంతరం నిందితులను అరెస్టు చేయనున్నట్లు చెప్పారు. ఈ వ్యహారంపై గత నెల 19న ‘రైతును ముంచి... పరిహారం దోచి..’ శీర్షికన ‘ఈనాడు’లో కథనం ప్రచురించిన విషయం విదితమే. వెంకన్నపాలెం గ్రామానికి చెందిన రైతు ఆబోతు మహలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. 2.10 ఎకరాల అసైన్డ్‌ భూమిని జగనన్న ఇళ్ల కాలనీ నిమిత్తం రెవెన్యూ వర్గాలు తీసుకున్నాయి. సేకరించిన భూమికి నష్టపరిహారంగా రైతు బ్యాంకు ఖాతాకు రూ.72.18 లక్షలను గతేడాది జనవరి 25న ప్రభుత్వం జమ చేసింది. మహలక్ష్మి వేలిముద్రలు తీసుకుని ఆయన ఖాతాలో ఉన్న నగదును జనవరి 27న రూ. 40 లక్షలు, రూ. 29.68 లక్షలు ఇలా రెండు దఫాలుగా మాజీ సర్పంచి సోమునాయడు తన ఖాతాకు బదిలీ చేయించుకున్నాడు. తనకు జరిగిన అన్యాయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న మహలక్ష్మి పోలీసులను ఆశ్రయించారు. వీఆర్వో బొడ్డు శ్రీను తన వద్ద పాన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, వేలిముద్రలు తీసుకున్నాడని, సోమునాయుడు నగదు డ్రా చేశారని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో రైతు మహలక్ష్మి పేర్కొన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని