బరువు తగ్గట్లేదా?

ఏళ్ల కొద్దీ చెమటోడుస్తున్నా.. క్రమం తప్పకుండా కసరత్తులు చేస్తున్నా.. కొద్దిమందిలో బరువు  కరగదు. ఒంట్లో కొవ్వు తరగదు. ఎందుకిలా అంటే..

Updated : 11 Jun 2022 01:28 IST

ఫిట్‌  హిట్‌

ఏళ్ల కొద్దీ చెమటోడుస్తున్నా.. క్రమం తప్పకుండా కసరత్తులు చేస్తున్నా.. కొద్దిమందిలో బరువు  కరగదు. ఒంట్లో కొవ్వు తరగదు. ఎందుకిలా అంటే..

* స్వీట్లు, జంక్‌ఫుడ్, కొవ్వులు అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటూ ఎంత బాగా వ్యాయామం చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఫైబర్‌ ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటుండాలి.

* కంటి నిండా నిద్ర లేకుండా అధిక కసరత్తులు చేస్తుంటే.. బరువు తగ్గడం మాటలా ఉంచితే.. శరీరంలోని జీవ గడియారం అస్తవ్యస్తమవుతుంది. కొత్త రోగాల బారిన పడొచ్చు. మంచి వ్యాయామం చేసినప్పుడు తగినంత నిద్ర తప్పనిసరి.

* అధికంగా నీరు తీసుకుంటూ శరీరం హైడ్రేటెడ్‌గా ఉన్నప్పుడే చేసిన వ్యాయామం ఒంట పడుతుంది. నిపుణుల సూచనలకు అనుగుణంగా వర్కవుట్స్‌ తర్వాత మంచినీరు తీసుకుంటుండాలి.

* నడక, పరుగుతోపాటు బరువు తగ్గడానికి ప్రత్యేకంగా ‘స్ట్రెంగ్త్‌’ వ్యాయామాలు చేస్తేనే ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. బర్పీ, లాంజెస్, స్క్వాట్, మౌంటెయిన్‌ క్లైంబర్‌లాంటి వాటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని