పంచుకుందాం

నీతో మాట కలుపుదాం అనుకున్నా...సముద్రమంత మౌనం నన్ను చూసి నవ్వింది!  నీ కళ్లలోకి చూద్దామంటే...ఆది, అంతం లేని శూన్యం అడ్డుగా నిలిచింది

Published : 18 Jun 2022 01:46 IST

* నీతో మాట కలుపుదాం అనుకున్నా...సముద్రమంత మౌనం నన్ను చూసి నవ్వింది!
నీ కళ్లలోకి చూద్దామంటే...ఆది, అంతం లేని శూన్యం అడ్డుగా నిలిచింది
* నీతో కలిసి అడుగులేద్దాం అని  కోరుకుంటే...తరిగిపోని దూరం కరగనని వెక్కిరించింది!
- జె.కాశ్యప్‌, ఈమెయిల్‌


పారదర్శకంగా.. ప్రత్యేకంగా

కొత్త ఫోన్‌ ఎవరి చేతిలో కనపడ్డా.. ఆటోమేటిగ్గా మన చూపు ఆగిపోతుంది. ఫీచర్లు, ప్రత్యేకతలుంటే మనసు పడిపోతుంది. అంతలా యువత జీవితాల్లో భాగమైపోయింది స్మార్ట్‌ఫోన్‌. అలాంటి అమితాసక్తి కలిగించే ఫోన్‌ ఒకటి మార్కెట్లోకి రాబోతోంది. అదే ‘నథింగ్‌ ఫోన్‌ 1’. పేరే కాదు.. దీంట్లోని ఫీచర్లూ ప్రత్యేకమే. సమతలమైన అంచులతో చూడటానికి ఐఫోన్‌ ఎక్స్‌, ఐఫోన్‌ 12 మోడళ్లను పోలి ఉంటుంది. వెనకవైపు ట్రాన్స్‌పరెంట్‌గా ఉండటంతో లోపల ఛార్జింగ్‌ కాయిల్‌, స్క్రూలు, బ్యాటరీ భాగాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పని చేసే ఈ ఫోన్‌, యాపిల్‌కి పోటీ కాబోతోందని టెక్‌ గురూలు చెబుతున్నారు. ప్రారంభ ధర రూ.24,999


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు