మనీనా?పని అనుభవమా?

క్యాంపస్‌ దాటకుండానే కొలువులు కొట్టడం.. పట్టా అందుకోగానే పట్టు పట్టి ఉద్యోగాలు సొంతం చేసుకోవడం ఈతరానికి కొట్టినపిండే. తర్వాతేంటి? జీతమా? అనుభవమా? అంటే అనుభవమే ముఖ్యం అంటారెవరైనా! ఎందుకంటే...

Published : 02 Jul 2022 00:50 IST

క్యాంపస్‌ దాటకుండానే కొలువులు కొట్టడం.. పట్టా అందుకోగానే పట్టు పట్టి ఉద్యోగాలు సొంతం చేసుకోవడం ఈతరానికి కొట్టినపిండే. తర్వాతేంటి? జీతమా? అనుభవమా? అంటే అనుభవమే ముఖ్యం అంటారెవరైనా! ఎందుకంటే...

* సాఫ్ట్‌వేర్‌, కార్పొరేట్‌, సర్కారు.. కొలువేదైనా.. అనుభవం పెరిగినకొద్దీ గుర్తింపు వస్తుంది. ‘ఏ సమస్య అయినా ఇట్టే పరిష్కరిస్తాడు’, ‘తనకి పని చెబితే తప్పకుండా అవుతుంది’ అనే పేరు, నమ్మకం రావాలంటే ముందు అనుభవమే కావాలి. ఒక్కసారి ఈ గుర్తింపు దక్కితే పదోన్నతుల నిచ్చెన ఎక్కడం, మార్కెట్లో డిమాండ్‌ సంపాదించుకోవడం తేలికే.
*జీతం కాదు.. కొందరికి పనిపై చెప్పలేనంత ప్రేమ ఉంటుంది. తామేంటో నిరూపించుకోవాలనే తపన కూడా. దీనికి ఒక వేదిక దొరకాలంటే.. ఉద్యోగ అనుభవమే ఉండాలి. మంచి జీతం, హోదా.. ఒక ఉద్యోగిలో కాంక్షను రగిలించలేదు.
* అనుభవం, ప్రతిభ ఉన్నవాళ్లను వదులుకోవడానికి ఏ సంస్థా సిద్ధపడదు. అనుభవజ్ఞులకు సహజంగానే చేస్తున్న పనిపై పట్టు ఉంటుంది. ఇతరులకూ నేర్పించగలుగుతారు. అనుభవం, ప్రతిభ లేక అధిక జీతం తీసుకునే ఉద్యోగుల మెడపై కత్తి వేలాడుతూనే ఉంటుంది.
అనుభవంతో కొత్త పరిచయాలవుతాయి. సీనియారిటీ పెరిగినకొద్దీ సహోద్యోగులు గౌరవిస్తారు. ఇది అంతులేని ఆనందానికి కారణమవుతుంది. పని మరింత శ్రద్ధగా చేసేందుకు కారణమవుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని