రాజసం.. విలాసం

అదిరిపోయే స్టైల్‌, ఉట్టిపడే రాజసం, సూపర్‌ పవర్‌.. ఈ లక్షణాలున్న మోటారుసైకిళ్ల కోసం వెతుకుతున్న కుర్రాళ్లకో శుభవార్త. అవే ఫీచర్ల ‘డుకాటీ స్క్రాంబ్లర్‌ అర్బన్‌ మోటార్డ్‌’ విపణిలోకి వచ్చేసింది. రేసింగ్‌లు, లాంగ్‌టూర్లకు అనువైన బండి ఇది. ప్రత్యేకతల

Published : 02 Jul 2022 00:51 IST

అదిరిపోయే స్టైల్‌, ఉట్టిపడే రాజసం, సూపర్‌ పవర్‌.. ఈ లక్షణాలున్న మోటారుసైకిళ్ల కోసం వెతుకుతున్న కుర్రాళ్లకో శుభవార్త. అవే ఫీచర్ల ‘డుకాటీ స్క్రాంబ్లర్‌ అర్బన్‌ మోటార్డ్‌’ విపణిలోకి వచ్చేసింది. రేసింగ్‌లు, లాంగ్‌టూర్లకు అనువైన బండి ఇది. ప్రత్యేకతల విషయానికొస్తే...
* 803సీసీ ఫ్యూయెల్‌ ఇంజెక్టెడ్‌ ఎల్‌ ట్విన్‌ ఇంజిన్‌తో దూసుకెళ్తుంది. 71.8బీహెచ్‌పీ దీని సొంతం.
* అత్యంత నాణ్యమైన టుబ్యులర్‌ స్టీల్‌ ట్రెలీస్‌ ఫ్రేమ్‌తో రూపొందించారు.
* 17 అంగుళాల స్పోక్డ్‌ అల్యూమినియం చక్రాలు అమర్చారు.
ఎరుపు, వైట్‌ సిల్క్‌ రంగుల గ్రాఫిక్స్‌తో చూడటానికి అందంగా ఉంది.
* సైడ్‌ నెంబర్‌ప్లేట్‌, అల్యూమినియం హ్యాండిల్‌బార్‌లు, డీఆర్‌ఎల్‌లతో కూడిన ఎల్‌ఈడీ లైట్లు, అంకెలు చూపించే ఎల్‌సీడీ తెర చెప్పుకోదగ్గ కొన్ని ఫీచర్లు.
ఇంధన ట్యాంకు సామర్థ్యం: 13.5 లీటర్లు. అత్యధిక వేగం: 161కి.మీ./గం., మైలేజీ: 20కి.మీ./లీటరుకి
* ధర రూ.11.49లక్షలు (ఎక్స్‌ షోరూం)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని