సొగసైన.. కబుర్లు!

ఐదున్నర అడుగుల సొగసరి.. అన్ని భాషల్లో మెరుస్తున్న ఆల్‌రౌండర్‌...ఎవరామె? ‘ది వారియర్‌’ హీరోయిన్‌ అక్షర గౌడ. అంతర్జాలంలో, కుర్రకారు చర్చల్లో ఈమధ్య జోరుగా వినిపిస్తున్న ఈ అమ్మడి సంగతులు సంక్షిప్తంగా.నేపథ్యం: అక్షర కన్నడ భామ.

Published : 09 Jul 2022 01:39 IST

ఐదున్నర అడుగుల సొగసరి.. అన్ని భాషల్లో మెరుస్తున్న ఆల్‌రౌండర్‌...ఎవరామె? ‘ది వారియర్‌’ హీరోయిన్‌ అక్షర గౌడ. అంతర్జాలంలో, కుర్రకారు చర్చల్లో ఈమధ్య జోరుగా వినిపిస్తున్న ఈ అమ్మడి సంగతులు సంక్షిప్తంగా.నేపథ్యం: అక్షర కన్నడ భామ. బెంగళూరులో పుట్టిపెరిగింది. అక్కడే ఇంజినీరింగ్‌ పూర్తి చేసింది. అసలు పేరు హరిణి గౌడ.

తెరంగేట్రం: ఎత్తు ఐదున్నర అడుగుల పైనే. స్నేహితుల సలహాతో మోడల్‌గా ప్రయత్నించింది. వాణిజ్య ప్రకటనల్లో మెరిసింది. అవే సినిమాకు రాచబాట వేశాయి. 2014లో ‘ఉయర్థిరు 420’ అనే తమిళ చిత్రంతో తెరపైకి వచ్చింది.

మెరుపులు: ‘తుపాకీ’, ‘మాయావన్‌’, ‘శూర్పణగై’ మంచి పేరు తీసుకొచ్చాయి. ‘రంగ్రేజ్‌’ అనే ఓ హిందీ సినిమాలోనూ నటించింది. ‘ప్రేమదల్లి’తో కన్నడంలోనూ అడుగుపెట్టింది.

ఆల్‌రౌండర్‌: హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ఇప్పటికే నటించింది. రెండేళ్ల కిందటే తెలుగులో ‘సిమ్రన్‌’ అనే వెబ్‌సిరీస్‌లో తళుక్కుమంది.

తెలుగులో: అక్షర టాలీవుడ్‌కి కొత్తేం కాదు. మన్మథుడు-2లో అక్షర అనే పాత్రలో నాగార్జున సరసన కనిపించింది.

ప్రేమాయణం: యువరాజ్‌సింగ్‌తో ప్రేమాయణం నడిపిస్తోందని 2011లో దేశవ్యాప్తంగా వార్తల్లోకి వచ్చింది. ‘అదంతా తూచ్‌ నేనసలు యువీని ఎప్పుడూ కలవనేలేద’ని ఖండించినా గుసగుసలు ఆగలేదు.

ఇష్టాయిష్టాలు: సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటుంది. మూగజీవాలంటే ప్రాణం. పెంపుడు కుక్కతో కలిసి దిగిన ఫొటోలు తరచూ పంచుకుంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని