మార్చేద్దాం..‘మైక్రో చీటింగ్‌’

అబ్బాయి, అమ్మాయి ప్రేమలో పడటం సహజం. ప్రేమలో పడ్డవాళ్లతోనే జీవితం కొనసాగించడం న్యాయం. కానీ కొందరుంటారు.. పాత ‘జ్ఞాపకాలు’ వదలరు. మాజీలను పలకరించకుండా ఉండరు. ఇదే ‘మైక్రో చీటింగ్‌’..

Updated : 13 Aug 2022 10:12 IST

అబ్బాయి, అమ్మాయి ప్రేమలో పడటం సహజం. ప్రేమలో పడ్డవాళ్లతోనే జీవితం కొనసాగించడం న్యాయం. కానీ కొందరుంటారు.. పాత ‘జ్ఞాపకాలు’ వదలరు. మాజీలను పలకరించకుండా ఉండరు. ఇదే ‘మైక్రో చీటింగ్‌’.. అంటే భావోద్వేగపు అవిశ్వాసం. ఈ లక్షణాలు గుర్తించి ప్రేమికులు తమ భాగస్వాములను మార్చుకోవాల్సిందే.

* వీళ్లు రోజంతా ఫోన్‌కే అతుక్కుపోతుంటారు. పడక గది, చివరికి రెస్ట్‌రూమ్‌కి వెళ్లినా మొబైల్‌ వెంట ఉండాల్సిందే. పక్కన భాగస్వామి ఉంటే ఫోన్‌ తెర కనిపించకుండా దాస్తుంటారు.  ఈమెయిల్‌, టెక్ట్స్‌, చాట్‌.. ఎవరి కంటా పడకుండా జాగ్రత్త పడతారు.
* తమలో తామే ముసిముసిగా నవ్వుకుంటారు. ఏమైందని అడిగితే ‘అబ్బే.. ఏం లేదు’ అంటుంటారు. తనకి వచ్చిన జోక్స్‌ని ఎవరితో పంచుకోరు. ఎవరికీ పంపరు.
* మాజీ ప్రియుడు/ప్రేయసిలను సామాజిక మాధ్యమాల్లో ఇంకా అనుసరిస్తూనే ఉంటారు. వాళ్లకి సంబంధించిన ప్రతి విషయాన్నీ తెలుసుకోవాలనే తాపత్రయం ఎక్కువ. వాళ్ల పోస్టుల్ని ‘లైక్‌’ చేయడం, కామెంట్‌ చేయడం మానరు.
* ‘నువ్వే సర్వస్వం’ అని ప్రస్తుత భాగస్వామితో తరచూ చెబుతున్నా.. మాజీ ప్రేమికుల గురించి గొప్పగా చెబుతూనే ఉంటారు. కుదిరితే వాళ్లతో మాట కలపడానికి ప్రయత్నిస్తుంటారు.
* నిండా ప్రేమలో ఉన్నా.. ‘డేటింగ్‌ యాప్‌’లలో ఇంకా ప్రొఫైల్‌లు పెట్టడం, సందేశాలు చెక్‌ చేయడం, చిత్రాలు మార్చడం ఆపరు.
* క్లబ్‌లు, పబ్‌లు, మాల్స్‌లాంటి పరిచయ వేదికలకు వెళ్లడం మానరు. భాగస్వామి వద్దంటే ప్రతిఘటిస్తారు. మాజీలతో దూరం ఉండమన్నా ఒప్పుకోరు. ఒకరితోనే సర్దుకుపోవడానికి ఎంతమాత్రం ఇష్టపడరు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని