నాకే ఎందుకిలా?

కొత్త ఫోన్‌ కొన్న వెంటనే.. మార్కెట్లో తగ్గింపు ధరతో ఆఫర్లు ప్రకటిస్తారు.

Published : 27 Aug 2022 01:16 IST

* కొత్త ఫోన్‌ కొన్న వెంటనే.. మార్కెట్లో తగ్గింపు ధరతో ఆఫర్లు ప్రకటిస్తారు.

* ఫేవరెట్‌ హీరో సినిమా చూస్తుండగానే ఫోన్‌లో డేటా అయిపోతుంది.

* ఎంతో కష్టపడి ఇష్టపడ్డ అమ్మాయితో మాట కలపగానే ‘అన్నా’ అంటుంది.

* ఎన్ని మంచి పనులు చేసినా గుర్తించరుగానీ.. తుంటరి పని చేయగానే టీచర్‌కి దొరికపోతాం.

* స్నేహితులతో మందు పార్టీకి సిద్ధమవుతుండగానే ఇంట్లోవాళ్లకి ఏదో అనారోగ్యం వస్తుంది.

* మన పేపరు చూసి రాసినోడికి మనకన్నా ఎక్కువ మార్కులొస్తాయి.

* పర్సు ఖాళీ అయినప్పుడే గాళ్‌ఫ్రెండ్‌ పార్టీ ఇవ్వమని అడుగుతుంది.

- మధు, కోదాడ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని