360 డిగ్రీల కోణంలో..

ఫొటోలు దిగకుండా యువతకి పూట గడవని కాలమిది. అందుకే ఫొటోగ్రఫీకి తెగ గిరాకీ. పెళ్లిళ్లు, పుట్టినరోజులు, వేడుకలను మధుర జ్ఞాపకాలుగా మార్చే ఈ ఛాయాచిత్రాలకు సంబంధించిన గ్యాడ్జెట్లు,

Published : 03 Sep 2022 00:44 IST

ఫొటోలు దిగకుండా యువతకి పూట గడవని కాలమిది. అందుకే ఫొటోగ్రఫీకి తెగ గిరాకీ. పెళ్లిళ్లు, పుట్టినరోజులు, వేడుకలను మధుర జ్ఞాపకాలుగా మార్చే ఈ ఛాయాచిత్రాలకు సంబంధించిన గ్యాడ్జెట్లు, యాక్సెసరీలకు డిమాండ్‌ ఎక్కువే. అయితే ఎంత ఖరీదైన కెమెరా, సెల్‌ఫోన్‌ వాడినా.. ఒక్కోసారి కొన్ని యాంగిల్స్‌ తీయడం వీడియోగ్రాఫర్లు, కెమెరామన్‌లకు అంత అనుకూలంగా ఉండదు. ట్రైపాడ్‌, మోనోపాడ్‌, టిల్ట్‌, స్లైడర్‌లాంటి వాటిని ఉపయోగించినా అనుకున్న కోణం రాదు. ఈ చిక్కులన్నింటికి చెక్‌ పెట్టేలా ఆధునిక టెక్నాలజీతో వచ్చింది The MIOPS 'CAP-SULE PRO' దీని ప్రత్యేకత ఏంటంటే.. ఈ టిల్ట్‌ యాక్సెసరీకి బిగించిన కెమెరా, స్మార్ట్‌ఫోన్‌ని 360 డిగ్రీల కోణంలో ఎటు కావాలంటే.. అటు తిప్పుకోవచ్చు. ఈ స్లైడర్‌ని ఎటు నుంచి ఎటైనా వంచుకొని బిగించుకోవచ్చు. మరెందుకు ఆలస్యం? ఈ పరికరాన్ని నచ్చిన నెచ్చెలికో.. స్నేహితుడికో కానుకగా ఇవ్వండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని