అందం.. అందాన్ని కోరుకోదా?

కుందనపు బొమ్మలా ఉండే టీవీ తార తను. లావుగా, నల్లగా ఉన్న ఓ నిర్మాతను పెళ్లాడింది. వాళ్ల ఫొటోలు వైరల్‌ అయ్యాయి. డబ్బు కోసమే తనిలా చేసిందని ట్రోల్‌ చేశారు కొందరు. మనసు చూసి మనువాడిందని వకాల్తా పుచ్చుకున్నారు ఇంకొందరు.

Updated : 17 Sep 2022 09:35 IST

కుందనపు బొమ్మలా ఉండే టీవీ తార తను. లావుగా, నల్లగా ఉన్న ఓ నిర్మాతను పెళ్లాడింది. వాళ్ల ఫొటోలు వైరల్‌ అయ్యాయి. డబ్బు కోసమే తనిలా చేసిందని ట్రోల్‌ చేశారు కొందరు. మనసు చూసి మనువాడిందని వకాల్తా పుచ్చుకున్నారు ఇంకొందరు. ఏదేమైనా ‘అప్సరసల్లాంటి అమ్మాయిలు అంత అందంగా లేని అబ్బాయిలకే పడతారు’ అనే చర్చ ఊపందుకుంది. అది నిజమేనా? అధ్యయనాలేం చెబుతున్నాయి? మానసిక నిపుణుల మాటేంటి? అంటే...

కొలంబియా విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం.. ప్రేమ, డేటింగ్‌కి యువత అందంగా ఉన్నవాళ్లనే ఏరికోరి ఎంపిక చేసుకుంటున్నారు. పెళ్లి విషయానికొచ్చేసరికి ఆ విషయం పక్కన పెట్టేస్తున్నారు. అందంగా ఉండేవాళ్లలో టెస్టోస్టిరాన్‌ స్థాయిలు ఎక్కువ. మిగతా వాళ్లతో పోలిస్తే భాగస్వాములను మార్చడం, బ్రేకప్‌లు చెప్పడం, మోసగించడం.. వీళ్లలో 38శాతం అధికమని తేలింది. ఇది కాకుండా ఏమంత అందంగా లేనివాళ్లు పడక గదిలో చెలరేగిపోతారని అధ్యయనకారులు తెలిపారు. ఈ విషయాలపై ఎంతో కొంత అవగాహన ఉన్నవాళ్లు పెళ్లి విషయంలో అందానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరంటున్నారు.

* బాహ్య సౌందర్యం కన్నా అంతఃసౌందర్యం, వ్యక్తిత్వాన్ని ఇష్టపడే అమ్మాయిలు అందం గురించి అస్సలు పట్టించుకోరట.
* మా ఇద్దరిలో నేనే అందంగా ఉండాలి, అంతా నన్నే గుర్తించాలి అనే ఆధిపత్య భావం ఉన్నవారూ కట్టుకోబోయే వ్యక్తి ఎలా ఉన్నా ఫర్వాలేదనుకుంటారు.
* భాగస్వామి అందంగా ఉంటే.. ఇతరుల వలలో పడతారు అని భావించే అమ్మాయిలు, అబ్బాయిలూ తను ఎలా ఉన్నా ఫర్వాలేదనుకొని అడ్జెస్ట్‌ అవుతారట.
* తమకన్నా అందం తక్కువగా ఉన్న వాళ్లను పెళ్లాడితే.. పెళ్లి చేసుకున్నవాళ్లు కృతజ్ఞతా భావంతో ఉంటారని, తమని అపురూపంగా చూసుకుంటారని కొందరి ఆలోచన.
* అందంకన్నా మంచి కుటుంబం, తెలివితేటలు, వ్యక్తిత్వం, ఆస్తిపాస్తులు.. వీటికే విలువ ఇచ్చేవాళ్లూ ఉంటారండోయ్‌..
* అందమైన భార్య ఉంటే ఎక్కువమంది అబ్బాయిలు గర్వంగా భావిస్తారట. వాళ్లని అధికంగా గౌరవించడమే కాదు.. బాగా ప్రేమ చూపిస్తారట. అది పొందడానికి అమ్మాయిలు సౌందర్యంలో తమకన్నా మెట్టు కింద ఉన్నవాళ్లనే కట్టుకుంటారంటున్నారు.
* ఒక అధ్యయనం ప్రకారం అనాకారులు తమని తాము నిరూపించుకోవడానికి ఇతరుల కన్నా అత్యధికంగా కష్టపడతారు. వీళ్లు పెళ్లైతే ఒక్కరితోనే జీవితం అంటిపెట్టుకొని ఉంటారట. ఆ వ్యక్తిత్వాన్నీ ఇష్టపడేవాళ్లుంటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని