పూజా హెగ్డేలాగ ఉంటదా?

‘పెళ్లి సందడి’ సినిమాలోని ‘రమ్యకృష్ణ లాగా ఉంటదా..? పాట ఆ రోజుల్లో యువతని ఓ ఊపు ఊపింది. దాన్నే ఈతరం కథానాయికలకు అన్వయిస్తూ సరదాగా రాస్తే..

Published : 17 Sep 2022 00:40 IST

‘పెళ్లి సందడి’ సినిమాలోని ‘రమ్యకృష్ణ లాగా ఉంటదా..? పాట ఆ రోజుల్లో యువతని ఓ ఊపు ఊపింది. దాన్నే ఈతరం కథానాయికలకు అన్వయిస్తూ సరదాగా రాస్తే..
పూజా హెగ్డేలాగా ఉంటదా..?  చెప్పర కన్నా... చెప్పరా నాన్నా..
రష్మికలాగా రంజుగుంటదా...? చెప్పరా కన్నా... చెప్పరా నాన్నా..

సమంత, కాజలూ లుక్కు ఉందా..? అనుష్క, తమన్నా కైపు ఉందా..?
చెప్పకుంటే దాని జాడ ఎట్ట తెలుసుకోమురా..?

మతిపోయే అందంతో మిస్‌ వరల్డ్‌గా మారిన ఐశ్వర్యారాయా..?  
అదిరిపోయే డాన్సులతో యువతను కైపెక్కించిన కత్రినా కైఫా..?

అరేబియా ఒంటెలాంటి పొడుగరి దీపికానా..?

అద్భుతః అనిపించే అందమైన అలియానా..?

నీ మగసిరి మెచ్చింది మల్లికా షెరావతా..? నిన్ను కవ్వించింది కరీనా కపూరా..?
ప్రియాంకలాంటి పడుచు భామా..?  సోనాక్షి లాంటి చందమామా..?

బిపాసా, కంగనా, విద్యాబాలనా..? చెప్పరా నాయనా శృతీహాసనా..?
ఒక్క ముక్క చెప్పు చాలు మోగుతాది పెళ్లిడోలు ।।పూజా హెగ్డే లాగా ఉంటదా।।

కుర్రోళ్లు ముసలోళ్లు వెర్రెక్కి వేడెక్కే ఇలియానానా...?
కొత్త పెళ్లి కూతురల్లె తెగ సిగ్గుపడే సొగసరి శ్రేయానా..?

బెల్లంముక్క లాంటి బుల్లి గడ్డమున్న కీర్తి సురేషా..?
యువకులకు పులకరింత రకుల్‌ప్రీత్‌సింగా..? రవ్వలడ్డు లాంటి పిల్ల అమలాపాలా..?

దక్షిణాదినే దున్నేసిన నయనతారా...? త్రిష, తాప్సి పోలికలోనా..? భూమిక, హన్సిక మాదిరిగానా..?
ప్రియమణి, ఆర్తి, ఛార్మీనా..? స్నేహ, నమిత, జెనీలియానా..? హింట్‌ ఇస్తే మాకు... జంట నీకు చేస్తాము ।।పూజా హెగ్డే లాగా ఉంటదా।।

- జముళ్లముడి ఆల్‌ఫ్రెడ్‌, గజ్జలకొండ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని